వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండు లక్షల రుణ మాఫీ - వడ్లకు రూ 2500 : ధరణి రద్దు చేస్తాం - రైతు డిక్లరేషన్ తో రేవంత్..!!

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఈ డిక్లరేషన్ లో అంశాలను వెల్లడించారు. తెలంగాణ తన నినాదం కాదని.. తమ పేగు బంధమని.. ఆత్మగౌరవమని చెప్పుకొచ్చారు. డిక్లరేషన్ లో భాగంగా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ప్రతీ ఎకరాకు రూ 15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని వెల్లడించారు. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న ప్రతీ కూలీకి - రైతుకు ఏటా రూ 12 వేల చొప్పున ఆర్దిక సాయం ఇస్తామని రేవంత్ ప్రకటించారు.

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం

రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం


రైతులు పండించిన పంటలకు అన్నింటికి గిట్టుబాటు ధర కల్పిస్తామని..చివరి క్వింటా వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేసారు. తెలంగాణలో మూత బడిన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. మెరుగైన పంటల భీమా పథకం తెస్తామని రేవంత్ స్పష్టం చేసారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఆదీవాసులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పిన రేవంత్.. వాటికి సంబంధించి - క్రమ విక్రయాలకు హక్కులు ఇస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న..ధరణి పోర్టల్ రద్దు చేస్తామని రేవంత్ ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజల భూములకు రక్షణ కల్పించేలా సరళీతరం చేస్తామని రేవంత్ చెప్పారు. సరి కొత్త రెవిన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసి..ప్రతీ పేదవాడిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు

ధరణీ పోర్టల్ రద్దు - నకిలీలపై ఉక్కుపాదం

ధరణీ పోర్టల్ రద్దు - నకిలీలపై ఉక్కుపాదం


వరంగల్ - ఖమ్మం ప్రాంతాల్లో నకిలీ విత్తనాలతో పంట నష్టపోతున్నారు.. వందలాది రైతుల ఆత్మహత్యలు జరిగాయని..తాము అధికారంలోకి రాగానే.. వాటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవటంతొ పాటుగా..వ్యక్తులు - సంస్థల ఆస్తులు జప్తు చేసి పరిహారం అందిస్తామని రేవంత్ ప్రకటించారు. పెండింగ్ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేసి..చివరి ఎకరా వరకు నీరు అందిస్తామన్నారు. రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వ్యవసాయాన్ని పండుగ లా మారుస్తామని...అది కాంగ్రెస్ బాధ్యత అని చెప్పారు. ప్రస్తుతం వరికి కనీస మద్దతు ధర రూ 1965గా ఉందన్నారు. దళారులు రూ 1200-1400 కే కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రస్తుతం కనీస మద్దతు ధర రూ 1965 నుంచి..క్వింటాల్ వడ్లు రూ 2500 కి కొనుగోలు చేస్తామని ప్రకటించారు.

రాహుల్ గాంధఈ ఆమోదంతోనే డిక్లరేషన్

రాహుల్ గాంధఈ ఆమోదంతోనే డిక్లరేషన్


అదే విధంగా.. రూ 2,200 కి మొక్కజొన్న కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కందులుకు రూ 6,300 కనీస మద్దతు ధర ఉండగా..దానిని రూ 6,700కి పెంచుతామని చెప్పారు. పత్తికి కనీస మద్దతు ధర రూ 6,025 ఉండగా.. తాము రూ 6,500 గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటించారు. పసుపు బోర్డు పైన టీఆర్ఎస్ - బీజేపీ మోసం చేసాయని..పసుపు బోర్డు ఏర్పాటుతో పాటుగా ఆ రైతులను ఆదుకోవటానికి రూ 12 వేలకు క్వింటా కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ఎర్రజొన్న రూ 3,500 కి.. చెరకు క్వింటా రూ 4 వేలకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ చేతిలో వంచనకు గురైన రైతులకు అండగా నిలవటానికి భావి ప్రధాని రాహుల్ వచ్చారని రేవంత్ చెప్పుకొచ్చారు. వరంగల్ రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ అధినాయకత్వం ఆమోదంతోనే ఈ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని..దీనిని అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేసారు.

English summary
TPCC Chief REvanth Reddy announced congress Farmer policy and minimum support prices for different crops in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X