పొన్నం, సురేఖ మంత్రి పదవులపై తేల్చేసిన పార్టీ- కేబినెట్ లోకి కొత్తగా..!!
తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనకు రంగం సిద్దం అవుతోంది. ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచాయితీ ఎన్నికల తరువాత మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని పార్టీ నిర్ణయించింది. అదే విధంగా పెండింగ్ కమిటీలు.. పోస్టుల పైన నిర్ణయం తీసుకున్నారు. ఇక.. గ్రేటర్ ఎన్నికలతో పాటుగా అనర్హత ఎమ్మెల్యేల పైన స్పీకర్ నిర్ణయం తరువాత కొత్త నిర్ణయాలకు పార్టీ సమాయత్తం అవుతోంది. ఈ దిశగా ఢిల్లీ కేంద్రంగా కసరత్తు కొనసాగుతోంది.
పంచాయితీ ఎన్నికలు పూర్తయిన తరువాత ప్రభుత్వం.. పార్టీలో కీలక నిర్ణయాల దిశగా కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ కార్యాచరణ గురించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించే అవకాశం ఉందని తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సురేఖలను తొలగిస్తారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులని, పార్టీ కోసం కష్టపడినవాళ్లు అని కితాబిచ్చారు.

అయితే శాఖలు మారుస్తారా? మంత్రివర్గంలో మార్పులుంటాయా? అన్న విషయాల్లో తనకు స్పష్టతలేదన్నారు. తాను క్యాబినెట్‌లోకి వెళతాననే విషయంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనను మంత్రివర్గంలోకి ఆహ్వానించారని, స్వయంగా కేసీ వేణుగోపాల్ తనతో మాట్లాడారని, తనకు ఆసక్తిలేదని చెప్పానని వివరించారు. పార్టీ కోసం పనిచేయడంలోనే తనకు సంతృప్తి ఉందని మహేష్ గౌడ్ చెప్పారు.
కాగా, నెలరోజుల్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీల నియామకం ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చివరిదశకు చేరింద న్నారు. ఉప్పల్‌లో మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, ప్రపంచ దేశాల దృష్టి తెలంగాణ మీద పడుతుందనే ఉద్దేశంతోనే ఈవెంట్‌కు ప్రభుత్వం సహక రించిందని తెలిపారు. నెహ్రూపై పార్లమెంట్‌లో మోదీ వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రియాంక గాంధీ అద్భుతంగా మాట్లాడారని కితాబిచ్చారు.
పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు సమర్థుల ను పక్కనబెట్టి వేరేవాళ్లకు అవకాశం కల్పించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ కారణంగా అభ్యర్థుల ఓట్లు చీలడంతో మూడో స్థానానికి పరిమితం కావాల్సిన బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారన్నారు. సీఎం రేవంత్ విజనరీ లీడర్ అని, ప్రపంచ స్థాయిలో ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. అంచనాలకు మించి గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, రాజకీయ ప్రాధాన్యం ఉండొద్దనే మంత్రులను ేస్టజీ మీదకు ఆహ్వానించలేదన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ కథ ముగిసిందని వ్యాఖ్యానించారు. హరీశ్, సమయం కోసం వేచి చూస్తున్నారని, వెన్నుపోటు ఖాయమని కీలక వ్యాఖ్యలు చేసారు.












Click it and Unblock the Notifications