ఎన్నికల వేళ రేవంత్ కీలక డిమాండ్ - ఆ అధికారులపై ఫిర్యాదు..!!
సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth REddy) వెల్లడించారు. కొందరు అధికారులు బీఆర్ఎస్ (BRS)ఎన్నికల నిర్వహణ టీమ్‌లా పనిచేస్తున్నారని ఆరోపించారు. అంజనీ కుమార్‌ను.. స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి(EC) స్పష్టంగా చెప్పామని వివరించారు. సంక్షేమ పథకాల చెల్లింపులు నవంబర్ 2 లోగా విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే నగదు బదిలీ కార్యక్రమాలను పూర్తి చేయాలని ఈసీని కోరినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు అనుకూలమైన రిటైర్డ్ అధికారులను తొలిగించాలని కోరినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పని చేస్తాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ను కాపాడేందుకు కేంద్రం పని చేస్తుందని రేవంత్ మండిపడ్డారు. ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు వాయిదా వేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెల్లిస్తుందని హమీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను బూచిగా చూపి కేసీఆర్ చెల్లింపులు ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేసినా.. బీఆర్‌ఎస్ ఓటమిను ఎవరూ కాపాడలేరని జోస్యం చెప్పారు. మళ్లీ కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

బీజేపీ-జనసేన పొత్తుపైన రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ పవన్ కల్యాణ్ తో పాటుగా కేఏ పాల్ ను కూడా కలుపుకోవాలని ఎద్దేవా చేసారు. నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపించారు. కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందన్నారు. క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ ఏం చెప్పాని చేయరని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు అవుతుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకలాపాలకు ప్రభుత్వ భవనాలు వాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం అధికార నివాసాన్ని పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్నారు.
తొమ్మిదిన్నారేళ్లుగా కొంత మంది అధికారులు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తుందో ఈసీకి వివరించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.తాము చెప్పింది ఒకటైతే బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వామపక్ష పార్టీలతో పొత్తులు జరుగుతున్నాయని చెప్పారు. ఇండియా కూమటిలో వామపక్షాలు భాగస్వాములుగా ఉన్నాయని గుర్తు చేసారు. తెలంగాణలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భట్టి ధీమా వ్యక్తం చేసారు. పార్టీ ప్రకటించిన గ్యారంటీ పథకాలపైన ప్రజల్లో ఆదరణ ఉందని..పార్టీ గెలుపు ఖాయమని భట్టి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications