సీతక్కను సీఎం చేస్తాం , అమరావతిని నిర్మిస్తాం - రేవంత్ సంచలనం..!!

తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా సీతక్క కాబోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో రేవంత్ పాల్గొన్నారు. తెలంగాణతో పాటుగా ఏపీ రాజకీయాల పైన స్పందించారు. అమరావతి ..పోలవరం తామే నిర్మిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ అంటే కాంగ్రెస్..కాంగ్రెస్ అంటే రేవంత్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ సంచలనంగా మారాయి.

అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ ను నిర్వాహకులు సత్కరించారు. పలు ప్రశ్నలు సంధించారు. ఈ సమయంలో రేవంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీలో నాడు వెంకయ్య నాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ వంటి తెలుగు ప్రముఖులు ఉండగా వారున్నారనే నమ్మకం ఉండేదన్నారు.

ఇప్పుడు ఢిల్లీలో తెలుగు వారికి ఎక్కడా అవకాశం లేదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తానా కు హాజరైన వారు రేవంత్ కు పలు ప్రశ్నలు సంధించారు. ఏపీలో పోలవం ప్రాజెక్టు, రాజధాని అమరావతి కట్టేది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే ఈ విషయం చెప్పారని..తాను అదే ప్రస్తావిస్తున్నానని స్పష్టత ఇచ్చారు.

ఇదే సమయంలో దళితులు..ఆదివాసీలకు సీఎం అయ్యే అవకాశం లేదా అంటూ రేవంత్ ను ప్రశ్నించారు. దీనికి రేవంత్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతెంది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్‌లో లేదన్నారు. అవసరమైతే సీతక్కను పార్టీ ముఖ్యమంత్రిని కూడా చేస్తుందన్నారు.

TPCC

ఆరు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న దళిత నేత మల్లిఖార్జున ఖర్గే ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడి గా ఉన్నారని గుర్తు చేసారు. ప్రజల కోసం ఏదైనా చేయాలని ఉందని..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎన్నారైలు సహకరించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్దించారు. కాంగ్రెస్ .రేవంత్ ను వేర్వేరుగా చూడవద్దని రేవంత్ కోరారు.

తెలంగాణలో కాంగ్రెస్సే రేవంత్..రేవంతే కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఏకలవ్య శిష్యులు చాలా మంది ఉన్నారని..ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ తెలుగు జాతి ఖ్యాతిని చాటారని కొనియాడారు.

TPCC

రేవంత్ రెడ్డి తానా సభల్లో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించగానే అనూహ్య స్పందన కనిపించింది. తానా సభలకు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. అమరావతి ప్రస్తావన సమయంలోనూ ఎన్నారైల నుంచి మద్దతు లభించింది. సీతక్కను సీఎం చేస్తామంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+