హైదరాబాద్‌లో 9 నుంచి 11 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు: ఈ మార్గాలు బంద్

హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో మరోసారి ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించనున్న నేపథ్యంలో 9వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 11వ తేదీ రేసింగ్ ముగిసే సమయం వరకు కూడా నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

ఖైరతాబాద్ నుంచి ఐమ్యాక్స్, తెలుగుతల్లి కూడలి వెళ్లే మార్గాలను మూసివేయనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లె వెళ్లాలని అధికారులు సూచించారు.

 Traffic restrictions from Dec 9th, 10th and 11th, due to Indian racing league in Hyderabad

ట్యాంక్ బండ్/తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే రహదారులు మూసివేయనున్నారు.

ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, ఐమ్యాక్స్ రోటరీ వైపు రోడ్ మూసివేయనున్నారు.

బుద్ధభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ ఐమ్యాక్స్ వైపు ప్రవేశం లేదు.

రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు రోటరీ ట్రాఫిక్ అనుమతించరు.

బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ కు అనుమతి లేదు.

ఖైరతాబాద్ బడా గణేష్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్, నెక్లెస్ రోటరీ రూట్ మూసివేయనున్నారు.

ఇక ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ రోడ్లు మూసివేయనున్నారు.

కాగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, నవంబర్ 19, 20 తేదీల్లో జరగాల్సిన రేసింగ్ ఈవెంట్లు రద్దయ్యాయి. అయితే, ప్రాక్టీస్ చేస్తుండగా పలువురు రేసర్లు గాయపడటం, కార్లు కూడా దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, 2023లో హైదరాబాద్ లో జరగాల్సిన ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ కోసం ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ ఈవెంట్ ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+