వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామారెడ్డి జిల్లాలో విషాదం..కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి, 90 మందికి అస్వస్థత

|
Google Oneindia TeluguNews

కలుషిత నీరు ముగ్గురి ప్రాణాలు తీసింది. 90 మంది గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురి చేసింది. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటన గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. మంచినీళ్లు తాగాలన్నా భయపడే స్థితిని కలిగిస్తుంది.

 కొమలంచ గ్రామంలో విషాదం .. కలుషిత నీరు తాగి ముగ్గురి మరణం

కొమలంచ గ్రామంలో విషాదం .. కలుషిత నీరు తాగి ముగ్గురి మరణం

నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామం లో సరఫరా అయ్యే రక్షిత మంచి నీటిని తాగిన వారు ముగ్గురు తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. మరో90మంది గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. తమ గ్రామంలో రోజు సరఫరా అయ్యే మంచినీటిని తాగిన తర్వాతే చాలామంది అస్వస్థతకు గురైనట్లుకొమలంచ గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఆ నీటిని మిగతా వారు తాగకుండా జాగ్రత్తపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

90 మందికి తీవ్ర అస్వస్థత ... నీటిలో విష ప్రయోగం జరిగిందేమో అని అనుమానం

90 మందికి తీవ్ర అస్వస్థత ... నీటిలో విష ప్రయోగం జరిగిందేమో అని అనుమానం

అయితే అప్పటికే ఈ నీటిని తాగిన ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి మృత్యువాత పడింది. రుచిత, సత్యనారాయణ అనే ఇద్దరు చిన్నారులతో సహా సునీత చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ప్రస్తుతం మరో 90మంది గ్రామస్థుల తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే ఈ ఘటనపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సరఫరా అయ్యే తాగునీటిలో ఎవరైనా విషప్రయోగానికి పాల్పడ్డారా అన్నఅనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 నీరు తాగాలంటేనే భయపడుతున్న జనం .... దర్యాప్తు చేస్తున్న అధికార గణం

నీరు తాగాలంటేనే భయపడుతున్న జనం .... దర్యాప్తు చేస్తున్న అధికార గణం

దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. అలాగే సంబంధిన అధికారులకు సమాచారం అందించి గ్రామానికి సరఫరా అయ్యేతాగునీటి సాంపిల్స్ ని పరీక్షల నిమిత్తం సేకరించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తుప్రారంభించారు. ప్రస్తుతం గ్రామంలో లభించే నీటిని తాగడానికి గ్రామస్తులుజంకుతున్నారు. పోలీసులు ఈ ఘటనకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.

English summary
A tragic incident took place in Kamareddy district. Nizamasaragar district of Komalancha village three people died after drinking the water which has been supplied in the village . Another 90 villagers are seriously ill and are being treated in hospital. Some of them seem to be in critical condition. police filed the case and investingating .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X