నారాయణపేట ఘటనలో మృతులంతా మహిళలే .. బోరున విలపిస్తున్న మృతుల బంధువులు
నారాయణ పేట జిల్లా మరికల్ మండలం తీలేరులో చోటు చేసుకున్న విషాదకర ఘటన అందరి మనసులను కలచి వేస్తుంది. ఉపాధి హామీ పనులు చేస్తున్న ఉపాధి కూలీలు 10 మంది మట్టి దిబ్బ కూలటంతో మృతి చెందారు. మృతులంతా మహిళలే కావటంతో తల్లిని కోల్పోయిన చిన్నారుల ఆక్రందనలతో ఆ ప్రాంతంలో విషాద చాయలు అలముకున్నాయి.
నారాయణ పేట ఘటనలో మృతులంతా మహిళలే .. పీలేరు గ్రామవాసులుగా గుర్తింపు
కుంటలు తవ్వుతుండగా మట్టిదిబ్బలు విరిగి కూలీల మీద పడడంతో 10 మంది మృతి చెందారు. ఎండ ఎక్కువగా ఉండడంతో వీరంతా గుట్టలాంటి ప్రదేశంలో సేద తీరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా పీలేరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. దీంతో పీలేరు గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఉపాధి హామీ కూలీల మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అధికారులు సైతం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.

మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి
మట్టి దిబ్బలు ఒక్కసారి కూలిన ఘటనలో 10 మంది మృతి చెందిన విషాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలీల మరణం దురదృష్టకరమన్నారు. మృతులు కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా మంత్రిని, అధికారులను కేసీఆర్ ఆదేశించారు. తీలేరు ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సహాయక చర్యలతో పాటు ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్న శ్రీనివాస్ గౌడ్
కూలీల మరణం దురదృష్టకరమని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మట్టిదిబ్బల దగ్గర ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించామని, ఘటనపై దర్యాప్తు చేయిస్తామని మంత్రి తెలిపారు. మట్టిదిబ్బల కింద కూర్చొని ఉండగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని, రాత్రి కురిసిన వర్షానికి తడిసి మట్టిదిబ్బ కూలినట్లు ఆయన పేర్కొన్నారు.

మృతుల వివరాలు చూస్తే
1)పి. అనురాధ(30)
2) బీమమ్మ(40)
3) బుడ్డమ్మ(26)
4) బి.లక్ష్మి(28)
5) కె. లక్ష్మి(30)
6) మంగమ్మ(32)
7) అనంతమ్మ(45)
8) కేశమ్మ(38)
9) బి. అనంతమ్మ(35)
10) లక్ష్మి (28) లుగా గుర్తించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications