ఉగాదినాడు విషాదం.. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు నీట మునిగి మృతి!
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగను జరుపుకుంటుంటే పండుగ వేళ తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ గ్రామంలో చెరువులో పడి తల్లితో పాటు ముగ్గురు పిల్లలు మృతి చెందిన ఘటన ఆ కుటుంబంలో విషాదానికి కారణమైంది.
తల్లితో పాటు ముగ్గురు పిల్లలు మృతి
చెరువులో స్నానానికి దిగిన ముగ్గురు పిల్లలు మునిగిపోతున్న క్రమంలో పిల్లలను కాపాడేందుకు తల్లి ప్రయత్నించింది. ముగ్గురు పిల్లలతో పాటు తల్లి కూడా ఈ ఘటనలో ప్రాణాలను కోల్పోయింది. దీంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి.ఇక కామారెడ్డి అగ్రహారంలో చోటు చేసుకున్న ఈ ఘటన నాలుగు ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో అక్కడ పండుగ పూట విషాదం చోటుచేసుకుంది.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత
కామారెడ్డి అగ్రహారంలో ఊరి చివర ఉన్న చెరువులోకి స్నానాలు చేసి బట్టలు ఉతుక్కుని రావడానికి తల్లితోపాటు ముగ్గురు పిల్లలు వెళ్లారు. ఎల్లారెడ్డి మండలం వెంకటాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 26 సంవత్సరాల మౌనిక, పదేళ్ల మైధిలి, ఎనిమిదేళ్ల అక్షర, ఐదేళ్ల వినయ్ లు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో గ్రామంలో పండుగ వాతావరణమే లేకుండా పోయింది.
మృత దేహాల వెలికితీత
ఇక నలుగురు నీట మునిగిపోయారని తెలిసిన గ్రామస్తులు వారిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు, పోలీసులు వారి మృతదేహాలను బయటకు తీయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పటివరకు పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. తల్లి మృతదేహం కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఉగాది నాడు ఊహించని విషాదం
అంతా సంతోషంగా కుటుంబం తో కలిసి పండుగ చేసుకుంటామని భావించిన వారు అనుకోకుండా ఊహించని ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. విశ్వావసు నామ ఉగాది అందరికీ శుభ ఫలితాలను ఇస్తుందని భావించిన వేళ అందుకు భిన్నంగా ఈ కుటుంబంలో మాత్రం తీరని వేదనకు కారణంగా మారింది.












Click it and Unblock the Notifications