సీఎం పిలిస్తే ఎందుకు వెళ్ళను.. తనకు సమాచారం లేదు: సిఎండి ప్రభాకర్ రావు
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో విద్యుత్ పై సమీక్ష నిర్వహించారు. అయితే విద్యుత్ పై సమీక్షకు ట్రాన్స్ కో, జెన్కో సిఎండి ప్రభాకర్ రావు రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షకు సిఎండి ప్రభాకర్ రావు హాజరుకాలేదు. సీఎండీ ప్రభాకర్ రావు పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టుగా వార్తలు రావడంతో ప్రభాకర్ రావు స్పందించారు.
అసలు తనకు సెక్రటేరియట్లో విద్యుత్ శాఖ పై సమీక్షకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు.మీడియా ద్వారానే తనకు ఈ విషయం తెలిసిందని అన్నారు. ముఖ్యమంత్రి పిలిస్తే తాను ఎందుకు వెళ్లకుండా ఉంటానని ఆయన ప్రశ్నించారు. సీఎంఓ నుండి కానీ, విద్యుత్ శాఖ నుండి కానీ తనకు ఎటువంటి ఆహ్వానం రాలేదని ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.

తనను పిలిస్తే ఖచ్చితంగా సమావేశానికి హాజరవుతానని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే సెక్రటేరియట్లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన విద్యుత్ పై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశానికి విద్యుత్ శాఖ స్పెషల్ సి ఎస్ సునీల్ శర్మ, సింగరేణి సిఎండి శ్రీధర్, విద్యుత్ శాఖ జేఎండి శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు తో పాటు విద్యుత్ సంస్థల డైరెక్టర్లు పాల్గొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, పంపిణీపై అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2014 జూన్ 2 తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ముందు పరిస్థితులు ఆ తర్వాత పరిస్థితుల పైన పూర్తి వివరాలు కావాలని రేవంత్ రెడ్డి అడిగారు. నిన్నటి నుంచి విద్యుత్ శాఖ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి సీఎండీగా ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దని ఆయనను సమీక్షకు హాజరైన ఆదేశించాలని పేర్కొన్నారు.
విద్యుత్ శాఖలో 85 వేల కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో ముందు ముందు మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. సీఎండీ ప్రభాకర్ రావును పిలిచి ఆయనను విచారిస్తారా? ప్రభాకర్ రావు దీనికి సమాధానం ఏం చెప్తారు అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications