శ్రీకాకుళంలో భూప్రకంపనలు, బోరబండలో కూడా: భయంతో పరుగెత్తిన ప్రజలు
హైదరాబాద్/శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం నాడు స్వల్పంగా భూప్రకంపసలు వచ్చాయి. ఎచ్చర్ల,, పొందూరు మండలాల్లో ప్రకంపనలు కనిపించాయి. కింతలిలో ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తారు.

బోరబండలో భూప్రకంపన వదంతులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భూమి కంపించినట్లుగా వదంతులు వినిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి గాయత్రి నగర్, పద్మావతి నగర్, భవానీ శంకర్ నగర్ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా 3 సెకన్ల పాటు కంపించినట్లుగా తెలుస్తోంది. జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగు తీశారు. అయితే, ఇవి భూప్రకంపనలా లేక పేలుడా అని తేలాల్సి ఉంది. కొందరు పేలుడు ఆంటున్నారు. అధికారులు పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications