వీడియో: బండి సంజయ్ కాన్వాయ్ పై టీఆర్ఎస్ శ్రేణుల రాళ్ళ దాడి: మిర్యాలగూడలో తీవ్ర ఉద్రిక్తత; పోలీసుల లాఠీ చార్జ్
వర్షాకాలంలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం బండి సంజయ్ నల్గొండ జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం నుంచి బండి సంజయ్ పర్యటన ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది. నల్గొండలోని ఆర్జాల బావి ఐకెపి సెంటర్ వద్ద రైతులతో మాట్లాడడానికి వెళ్ళిన బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి చేసిన ఘటనతో మొదలైన ఉద్రిక్త పరిస్థితులు మిర్యాలగూడలోనూ కొనసాగాయి.మిర్యాలగూడాలో బండి సంజయ్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మిర్యాలగూడ పట్టాన శివారులో బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ళ దాడి
మిర్యాలగూడ పట్టణ శివారులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్ పై టిఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతేకాదు బిజెపి తెలంగాణ రథసారథి బండి సంజయ్ పై కూడా దాడి చేయడం కోసం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. బండి సంజయ్ కాన్వాయ్ ను అడ్డుకున్న అడ్డుకునేందుకు ప్రయత్నించిన టిఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకోవడం, కట్టడి చేయడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. టిఆర్ఎస్ శ్రేణులను బిజెపి కార్యకర్తలు ప్రతిఘటించడంతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
మిర్యాలగూడాలోనూ టీఆర్ఎస్, బీజేపీ బాహాబాహీ, పోలీసుల లాఠీ చార్జ్; బీజేపీ ధర్నా
మిర్యాలగూడాలోనూ రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మోడీ డౌన్ డౌన్ అంటూ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బండి సంజయ్ వాహనంపై కార్యకర్తలు రాళ్లతో, కోడిగుడ్లతో దాడి చేశారు .బండి సంజయ్ కాన్వాయ్ పై దాడికి నిరసనగా నార్కెట్ పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై బీజేపీ శ్రేణులు బైఠాయించి ఆందోళన చేశారు.పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను కంట్రోల్ చేయాల్సి వచ్చింది. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అడుగడుగునా టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల అడ్డగింతల మధ్య, అతికష్టం మీద బండి సంజయ్ కాన్వాయ్ ను పోలీసులు మిర్యాలగూడను దాటించారు.

సూర్యాపేట జిల్లాలోనూ టీఆర్ఎస్ ఆందోళనలు, ఉద్రిక్తతల మధ్య బండి సంజయ్ పర్యటన
ఇదిలా ఉంటే సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి బ్రిడ్జి వద్దకు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు భారీగా చేరుకున్న క్రమంలో బండి సంజయ్ పర్యటనను అడ్డగించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు రంగంలోకి దిగారు. దీంతో వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా ఆర్జాల బావి ఐకెపి సెంటర్ కి వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అని వారికి భరోసా కల్పించడానికి, అక్కడికి వచ్చిన బిజెపి నాయకులు కార్యకర్తలు పై టీఆర్ఎస్ గూండాలు రాళ్లు కోడిగుడ్లతో దాడి ప్రయత్నించారని ,బిజెపి కార్యకర్తలు టిఆర్ఎస్ కార్యకర్తలను తిప్పికొట్టి ఉరికించారు అంటూ బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Recommended Video

నల్గొండ జిల్లాలో ఐకేపీ కేంద్రాల వద్ద రైతుల బాధలు విన్న బండి సంజయ్ .. సర్కార్ పై ఫైర్
నల్గొండ జిల్లా తిప్పర్తి, కుక్కడంలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకు వచ్చి రోజుల తరబడి రైతులు నిరీక్షిస్తున్నారు అని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా మద్దతు ధర కల్పించకుండా ఇబ్బంది పెడుతోందని రైతుల ఆవేదన చెందుతున్నారని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బండి సంజయ్. రైతుల కోసం దేనినైనా సహిస్తామని, దాడులకు భయపడేది లేదని, తాటాకు చప్పుళ్ళకు భయపడమని బండి సంజయ్ తేల్చిచెప్పారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications