వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్, బీజేపీలది తెలంగాణాలో గుద్దులాట - ఢిల్లీలో ముద్దులాట : నార్కో టెస్టులు చెయ్యాలన్న సీపీఐ నారాయణ

|
Google Oneindia TeluguNews

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ బిజెపి, టిఆర్ఎస్ పార్టీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. బండి మీద కారు ప్రయాణం చేస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నారాయణ బిజెపి, టిఆర్ఎస్ లకు మధ్య అవగాహన ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీలది గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అంటూ నారాయణ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీలు సిగపట్లు పడుతున్నాయని, ఇక ఢిల్లీ కేంద్రంగా కలిసి ముందుకు సాగుతున్నాయని నారాయణ తన వ్యాఖ్యల ద్వారా పేర్కొన్నారు.

తెలంగాణా విమోచనా దినోత్సవం జరపటం టీఆర్ఎస్ , బీజేపీలకు ఇష్టం లేదు
ప్రధాని మోడీ పాలనకు వ్యతిరేకంగా ఈనెల 27వ తేదీన భారత్ బంద్ కు పిలుపునిస్తున్నట్లు సిపిఐ నేత నారాయణ వెల్లడించారు. ఈ బంద్ లో టిఆర్ఎస్, టిడిపి కూడా పాల్గొనాలని నారాయణ కోరారు. తెలంగాణలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట ఆడుతున్న టిఆర్ఎస్, బిజెపి వైఖరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని నారాయణ విమర్శించారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మాట్లాడిన నారాయణ టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీకి భయపడి విమోచన దినోత్సవం గురించి మాట్లాడకుండా మిన్నకుంటే, బిజెపి మతం రంగు పులమటానికి ప్రయత్నిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు.

TRS and BJP wrestling in the gully and being friends in Delhi : CPI Narayana

బీజేపీ, టీఆర్ఎస్ లకు నార్కో పరీక్షలు చెయ్యాలన్న నారాయణ
రెండు పార్టీలకు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం జరపటం ఇష్టంలేదని ఆయన వెల్లడించారు. కావాలంటే బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలని నారాయణ వ్యాఖ్యానించారు. అప్పుడు నిజం బయట పడుతుంది అంటూ పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మాట్లాడే అర్హత ఒక కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని నారాయణ అభిప్రాయపడ్డారు. అంతేకాదు సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ ను నారాయణ డిమాండ్ చేశారు.

సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకూ తెలంగాణా విమోచనా వారోత్సవాలు :: చాడా వెంకటరెడ్డి
విద్యాసాగర్ రావు కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు సాయుధ పోరాట యోధులకు పెన్షన్ ఇవ్వనన్నారని నారాయణ గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవంపై హిందువులో .. ముస్లిం నవాబులో గెలిచినట్టుగా బిజెపి చూపించే ప్రయత్నం చేస్తోందని నారాయణ విమర్శించారు. సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకూ తెలంగాణా విమోచనా వారోత్సవాలు కొనసాగుతాయని, అమరులకు నివాళి కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ లు డబుల్ గేమ్ లు ఆడుతున్నారు : చాడా వెంకటరెడ్డి
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారందరికీ ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని చాడా వెంకట రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో చాడ వెంకట రెడ్డి బిజెపి, టిఆర్ఎస్ డబుల్ గేమ్ ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టింది ప్రజా సంగ్రామ యాత్ర కాదని అది ప్రజా దగా యాత్ర అని విమర్శించారు. బండి పాదయాత్రను ప్రజలు గుర్తించడం లేదని, ఆయన పాదయాత్రలో పస లేదని విమర్శించారు చాడా వెంకటరెడ్డి. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి కేసీఆర్ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని పేర్కొంటూనే, తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని కేంద్రం గుర్తించిన తరువాతనే అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

English summary
The CPI national secretary Narayana made interesting remarks on the BJP and TRS parties. He criticized the BJP and TRS parties for cheating the people and said they are playing double game. In telangana trs and bjp fighting but they are working together in delhi. Narayana, who made interesting remarks that the car was traveling on bandi, alleged that there was an understanding between the BJP and the TRS. Narayana criticized the TRS and BJP for wrestling in the gully and being friends in Delhi. In his remarks, Narayana said that the two parties were getting close in the state of Telangana and were moving forward together with Delhi as the center.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X