హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ వ్యూహం సక్సెస్.. 'బలిపశువు' విమర్శలు పటాపంచలు... ఎమ్మెల్సీగా సురభి వాణీ దేవీ ఘన విజయం...

|
Google Oneindia TeluguNews

ఉత్కంఠకు తెరపడింది... హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి రెండో ప్రాధాన్యత ఓట్లతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియ మొదలైన ఈ నెల 17 నుంచి ఇప్పటివరకూ సురభి వాణిదేవే ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు. చివరకు తన సమీప బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుపై 11,703ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో బీజేపీ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. టీఆర్ఎస్ అభ్యర్థిని వాణీదేవికి 1,49,269 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రామచందర్ రావుకి 1,37,566 ఓట్లు వచ్చాయి. దీనిపై కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

తెలంగాణ భవన్‌లో సంబరాలు...

తెలంగాణ భవన్‌లో సంబరాలు...


టీఆర్ఎస్ గెలుపుతో తెలంగాణ భవన్‌లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో వరంగల్-ఖమ్మం-నల్గొండ ఫలితం వెలువడ్డాక... మంత్రి కేటీఆర్ కూడా తెలంగాణ భవన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢీలా పడ్డ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బిగ్ బూస్టింగ్ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ముందు సాధించిన ఈ విజయం ఆ పార్టీలో ఆత్మస్థైర్యాన్ని పెంచేదిగా మారింది.

కేసీఆర్ వ్యూహం సక్సెస్...

కేసీఆర్ వ్యూహం సక్సెస్...

దుబ్బాక,జీహెచ్ఎంసీ మినహా అంతకుముందు జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని మాత్రం ఆ పార్టీ ఇప్పటివరకూ గెలుచుకోలేకపోయింది. గతంలో ఇక్కడినుంచి టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి వ్యూహాత్మకంగా దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తెను ఇక్కడినుంచి బరిలో దింపడం కలిసొచ్చింది. అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం చేసినా... బలమైన అభ్యర్థిని పోటీకి పెట్టడంతో విజయం టీఆర్ఎస్‌నే వరించింది.

 ఆ విమర్శలన్నీ పటాపంచలు...

ఆ విమర్శలన్నీ పటాపంచలు...

నిజానికి సురభి వాణీదేవీకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి కేసీఆర్ ఆమెను బలిపశువును చేయబోతున్నారన్న విమర్శలు వినిపించాయి. ఆమె మరో శంకరమ్మ(తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత చారి తల్లి)లా మిగిలిపోతుందని చాలామంది భావించారు. గతంలో శంకరమ్మను హుజూర్‌నగర్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీకి దింపి కేసీఆర్ ఆమెను బలిపశువును చేశారన్న విమర్శలు వినిపించాయి. అక్కడ టీఆర్ఎస్‌కు బలం లేదని తెలిసే శంకరమ్మకు టికెట్ ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు సురభి వాణి దేవి విషయంలోనూ ఇలాంటి విమర్శలే వ్యక్తమయ్యాయి.టీఆర్ఎస్‌కు బలం లేని చోట పీవీ కుమార్తెను పోటీకి దింపి.. కేసీఆర్ ఆమెను బలి చేయబోతున్నారని చాలామంది భావించారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సిట్టింగ్ అభ్యర్థి రామచంద్రరావుపై ఆమె విజయం సాధించారు.

ఆ ముగ్గురి కృషితో

ఆ ముగ్గురి కృషితో

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానానికి మంత్రులు హరీశ్ రావు,ప్రశాంత్ రెడ్డి,గంగుల కమలాకర్‌లు ఇన్‌చార్జిలుగా నిరంతరం శ్రమించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను ఈ ముగ్గురు విజయవంతం చేయడంతో వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అటు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం దిశగా సాగుతున్నారు. ప్రస్తుతం పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,22,639 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా... ఆయన తర్వాతి స్థానంలో 99,207ఓట్లతో తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్) రెండో స్థానంలో ఉన్నారు.

English summary
TRS candidate Surabhi Vanidevi secured a solid victory with second preference votes in the Hyderabad-Rangareddy-Mahabubnagar graduates mlc election. Surabhi Vanideve has been leading since the 17th of this month when the counting process began. She finally won over her nearest BJP candidate Ramachandra Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X