నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీ ధర్మపురి అరవింద్ వాహనంపై టీఆర్ఎస్ శ్రేణుల దాడి, ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: ఆర్మూర్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వెళ్తుండగా.. ఆర్మూర్ మండలం ఇస్సపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో అరవింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

కాగా, నందిపేట్ పర్యటనకు వెళ్లిన ఎంపీ అర్వింద్‌ను గొడవలు జరిగే అవకాశం ఉందని మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో నిరసనగా మామిడిపల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు అర్వింద్. ఎంపీ అర్వింద్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు ఆలూర్ బైపాస్ సమీపంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ట్రాక్టర్ టైర్లు అడ్డం పెట్టారు. దీంతో భారీగా మోహరించారు పోలీసులు.

TRS followers Attacked on mp dharmapuri arvind vehicle

ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ... నందిపేట్ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు వెళ్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. సుమారు 200 మంది ఆ పార్టీ కార్యకర్తలు తమకు అడ్డు తగిలారని, రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి వేశారని ఆరోపించారు. ఈ విషయంపై సీపీ, ఏసీపీలతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు ప్రేక్షక పాత్ర వహించారన్నారని మండిపడ్డారు.

పోలీసులే దగ్గరుండి తమ వాహనాలపై దాడి చేయించారని ఎంపీ అరవింద్ ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తాము పదే పదే చెబుతున్నామని.. ఈరోజు అది మరోసారి రుజువైందన్నారు. పోలీసులు అమ్ముడు పోయి.. గులాబీ రౌడీలకు మద్దతిస్తున్నారన్నారు. పోలీసుల తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్.

ఈ ఘటనపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని, తమ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కాగా, టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని ఆరోపిస్తూ పోలీస్ కమిషనర్‌కు ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని కోరారు.

కాగా, మరోవైపు, తన నియోజక వర్గంలో ఎక్కడైనా పర్యటిస్తానన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. తనతో పాటు బీజేపీ కార్యకర్తలను హత్య చేసేందుకు టీఆర్ఎస్ కుట్ర చేసిందన్నారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి రాడ్లు కత్తులతో సిద్ధమయ్యారన్నారు.

నవీన్ ఆత్మహత్య నా గుండెను కలచి వేసింది: బండి సంజయ్
నవీన్ అనే యువకుడి ఆత్మహత్య తన గుండెను కలచి వేసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదనే బాధతో ఖమ్మంలో నిరుద్యోగి నవీన్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నవీన్ సోదరుడితో మాట్లాడి ఆత్మహత్యకుగల కారణాలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. నవీన్ కుటుంబానికి అండగా ఉండాలని బీజేపీ శ్రేణులకు సూచించారు. నిరుద్యోగులెవరూ ఇకపై ఆత్మహత్య చేసుకోవద్దన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం కలిసి పోరాడదామంటూ యువతకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.

English summary
TRS followers Attacked on mp dharmapuri arvind vehicle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X