కెసిఆర్‌కు బిజెపి థ్రెట్: ముస్లిం కోటాకు బ్రేక్, వాయిదా
ముస్లిం కోటా బిల్లును పార్టీ ప్లీనరీ లోగా ఆమోదించాలనే కెసిఆర్ ఆలోచనకు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. బిజెపి నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత కారణంగా అది వాయిదా పడినట్లు సమాచారం.
హైదరాబాద్: పార్టీ ప్లీనరీకి ముందే ముస్లిం కోటా బిల్లును ఆమోదించాలనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచనకు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ముస్లిం కోటా బిల్లును ఆమోదించాలని ఆయన భావించారు.
ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందుకు సుధీర్ కమిటీని వేసి నివేదికను కూడా తెప్పించుకున్నారు. ప్లీనరీ సమావేశాలకు ముందే ముస్లిం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలనే కెసిఆర్ ఆలోచన వాయిదా పడినట్లు చెబుతున్నారు.

తెరాస ప్లీనరీ సమావేశం ఈ నెల 21వ తేదీన కొంపల్లిలో జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకుంటుంది. ఇదే సమావేశంలో కెటిఆర్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టే అవకాశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్లీనరీ సమావేశం తర్వాత ఏప్రిల్ 27వ తేదీన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
తాము మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నట్లు బిజెపి ప్రకటిస్తూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఆందోళనకు శ్రీకారం చుడుతామని హెచ్చరించింది. ఈ అంశంపైనే బిజెపి వచ్చే ఎన్నికల కోసం మెజారిటీ హిందువులను కూడగట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
ఈ స్థితిలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై పార్టీ ప్లీనరీ సమావేశంలో చర్చించనున్నారు. ముస్లిం కోటాను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేసే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించుతాయి. అందువల్ల రాజ్యాంగపరమైన రక్షణ కోసం ముస్లిం రిజర్వేషన్ల కల్పనను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉంటుంది.
ముస్లిం కోటా బిల్లును వారం రోజుల్లో అసెంబ్లీలో ఆమోదిస్తామి కెసిఆర్ మార్చి 27వ తేదీన హామీ ఇచ్చారు. అయితే రెండు వారాలు గడిచినా ఈ విషయంపై ఏ విధమైన ప్రగతీ లేదు. మార్చి 27వ తేదీన శాసనసభ సమావేశాలు ముగిశాయి. ముస్లిం కోటా బిల్లు ఆమోదానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి అసెంబ్లీ సమావేశాలను ప్రోరోగ్ చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications