ప్రాధాన్యత లేదని మంత్రి సమక్షంలోనే టిఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
వికారాబాద్: పార్టీలో తనకు సముచిత గౌరవం దక్కడం లేదని ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన టిఆర్ఎస్ సభలో ఆయూబ్‌ఖాన్ అనే టిఆర్ఎస్ కార్యకర్త కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆ సమయంలో మంత్రి మహేందర్‌రెడ్డి అక్కడే ఉన్నారు.

వికారాబాద్ జిల్లా తాండూరులో బుదవారం నాడు జరిగిన టీఆర్ఎస్ సభలో కలకలం చెలరేగింది. ఈ సభకు మంత్రి మహేందర్ రెడ్డి కూడా వచ్చారు. ఓ వైపు సభ జరుగుతుండగానే మరోవైపు ఓ టీఆర్ఎస్ కార్యకర్త ఆయూబ్‌ఖాన్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

వెంటనే స్పందించిన టీఆర్ఎస్ కార్యకర్తలు మంటలు ఆర్పేసి, చికిత్స కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు.. అయితే, ఇప్పటికే ఆ కార్యకర్త శరీరం అధిక భాగం కాలిపోయింది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే కారణంగానే ఆయూబ్‌ఖాన్ ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించాడని పార్టీకార్యకర్తలు ప్రకటించారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications