‘ఉమామాధవరెడ్డి ద్వారా నయీమ్‌కు 5కోట్లు: చీకటి సామ్రాజ్యం వెనక కోమటి రెడ్డి బ్రదర్స్’

హైదరాబాద్: కోమటి రెడ్డి బ్రదర్స్‌పై మరోసారి టిఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్యాంగ్‌స్టర్ నయీం చీకటి సామ్రాజ్యం వెనుక కోమటిరెడ్డి సోదరుల హస్తముందని వారు ఆరోపించారు. మొదటి నుంచీ వారికి సంబంధాలు ఉన్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి ద్వారా రూ.5 కోట్లు నయీంకు ఇచ్చి ఎమ్మెల్సీగా రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నల్గొండ జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి ఆరోపించారు.

సోమవారం నల్గొండ జిల్లా టిఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నయీం ఎవరెవరికి ఫోన్లు చేశారో, ఏమని బెదిరించారో బట్టబయలు చేయాలని డిమాండ్ చేశారు. నయీంతో కలిసి కోమటిరెడ్డి బద్రర్స్ చేసిన దందాలపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని కోరారు.

నయీంపై సిట్ దర్యాప్తులో తమ చీకటి ఒప్పందం బయటపడుతుందేమోననే భయంతోనే, టిఆర్‌ఎస్ నేతలకు నయీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. నయీంను సృష్టించింది టీడీపీ, పెంచి పోషించింది కాంగ్రెస్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రాజగోపాల్‌రెడ్డి నయీం గురించి నోరు విప్పకుండా, ఇప్పుడు ఆ గ్యాంగ్‌స్టర్‌తో టిఆర్‌ఎస్ నేతలకు సంబంధాలు ఉన్నాయని మాట్లాడటం సిగ్గుచేటన్నా రు.

నయీం ఎన్‌కౌంటర్ తర్వాత క్రాంతిసేన పేరుతో ముగ్గు రు ఎమ్మెల్యేలకు వచ్చిన బెదిరింపుల్లో కోమటిరెడ్డి సోదరుల హస్తం ఉందని ఆరోపించారు. నరకాసురుడి వధ జరిగిందని ప్రజలు సంతోషపడుతూ సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి జేజేలు పలుకుతుంటే.. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు ఎందుకని ప్రశ్నించారు. ఆయనతో ఉన్న సంబంధాలు ఏమిటో చెప్పాలన్నారు.

నయీం ఆస్తులను లాక్కోవడానికి ప్రభుత్వం యత్నిస్తున్నదని బాధపడుతున్నారని, అందుకే ఆస్తులు ఎన్ని ఉన్నాయో రాజగోపాల్‌రెడ్డికి తెలుసనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. నయీం అండతోనే రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరులు కోట్లు సంపాదించి ఈ స్థాయికి ఎదిగినట్లు అనుమానాలున్నాయని, వీరి ఆస్తులపైనా విచారణ చేయాలని సిట్‌ను కోరనున్నట్లు తెలిపారు.

TRS MLA fires at Komatireddy brothers

తనను హతమార్చేందుకు రూ.5 కోట్లు డీల్ చేసుకున్నట్లు సమాచారం ఉందని, కోమటిరెడ్డి బ్రదర్స్ గ్రామం నుంచే బెదిరింపులు వచ్చాయన్నారు. కాగా, వైయస్సార్ హయాంలో నల్లమల అడవుల్లో నక్సల్స్‌ను గుర్తించి ఏరిపారేసి, నయీంను ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. నయీం చేతిలో టిఆర్‌ఎస్ నేతలు సాంబశివుడు, రాములు హత్యకు గురైనప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

పదేళ్ల కిందట టీడీపీ నేత మాధవరెడ్డి.. నయీంను సృష్టించి బెల్లి లలితను హత్య చేయించారని, మరో నలుగురు యువకులను నరికి చంపిన విషయంపై ఇప్పుడు మాట్లాడరెందుకని ప్రశ్నించారు. నయీం కేసు విషయంలో టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు చేయడాన్ని బండా నరేందర్‌రెడ్డి తప్పుబట్టారు.

గతంలో చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులే నయీం ఎదుగుదలకు సహకరించారని ఆరోపించారు. సిట్ విచారణతో బండారం బయటపడుతుందనే కోమటిరెడ్డి సోదరులు టీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+