హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిడ్నీలో కవిత ఆనందం: ఎల్బీ స్టేడియంకు సానియా, సింధు, పూనం క్యూ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శనివారం భాగ్యనగరంలోని ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఆడి గిన్నిస్‌ రికార్డు సృష్టించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆనందం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆమె ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి మాట్లాడారు.

కవిత సంబరం

కవిత సంబరం

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకయిన బతుకమ్మ రాష్ట్రంలోనే గాక ఇతర రాష్ట్రాల్లోనూ ఖ్యాతి పొందిందని, ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతోందన్నారు. తెలంగాణలో 1100 కేంద్రాలు, ముంబై తదితర ప్రాంతాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలను జాగృతి తరపున నిర్వహిస్తున్నామన్నారు.

కవిత

కవిత

బతుకమ్మ ఉత్సవాలతో సిడ్నీ నగరం పులకించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.

బతుకమ్మ పేరుస్తున్న కవిత

బతుకమ్మ పేరుస్తున్న కవిత

ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఆమె ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు సిడ్నీలోని విమానాశ్రయంలో ఎంపీ కవితకు ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు. పండుగకు వచ్చిన ఆడపడుచును ఆహ్వానించినట్టుగా బొట్టుపెట్టి స్వాగతం పలికారు.

కోలాటం ఆడుతున్న కవిత

కోలాటం ఆడుతున్న కవిత

అనంతరం ఎన్నారైల ఇళ్లలో బతుకమ్మలను తయారు చేసి ఎమింగ్‌టన్ సెంటర్‌కు తీసుకెళ్లి సద్దుల బతుకమ్మ ఆడారు. ఉయ్యాల పాటలు పాడుతూ, గౌరమ్మను పూజిస్తూ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అందరితో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.

బతుకమ్మ పేరుస్తూ కవిత

బతుకమ్మ పేరుస్తూ కవిత

ఈ సందర్భంగా ఎంపీ కవిత కొద్దిసేపు కోలాటం ఆడి అందరినీ ఉత్తేజ పరిచారు. ఈ ఉత్సవాల్లో తెలంగాణ ఎన్నారై మహిళలు, ఆస్ట్రేలియా మహిళలు, ఆస్ట్రేలియా తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆధ్యక్షుడు జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.

గిన్నిస్ బుక్‌లోకి బతుకమ్మ

గిన్నిస్ బుక్‌లోకి బతుకమ్మ

శనివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మహాబతుకమ్మ ఉత్సవాలు విజయవంతమయ్యాయి. స్టేడియంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ వేలాదిగా తరలివచ్చిన మహిళలు ఆడిపాడారు.

ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ

ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ

మొత్తం 12 వేల మంది మహిళలు వచ్చారు. ఇందులో 10,029 మంది బతుకమ్మ ఆటకు సిద్ధమయ్యారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా 9292 మంది మహిళలు బతుకమ్మ ఆడి గిన్నిస్‌ బుక్‌లో మహా బతుకమ్మకు చోటు దక్కించారు.

హాజరైన తలసాని

హాజరైన తలసాని

పాటలకు అనుగుణంగా లయబద్ధంగా నృత్యాలు చేస్తూ సందర్శకులను ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు పాల్గొని బతుకమ్మ ఆటలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని హాజరయ్యారు.

మహా బతుకమ్మ

మహా బతుకమ్మ

శనివారం భాగ్యనగరంలోని ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఆడి గిన్నిస్‌ రికార్డు సృష్టించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఆనందం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆమె ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి మాట్లాడారు.

స్వామి గౌడ్

స్వామి గౌడ్

తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మెన్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలకు పూజించే ప్రాంతం తెలంగాణ మాత్రమేనన్నారు. గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించిన మహిళలందరికీ అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో బతుకమ్మ వేడుకలు ప్రపంచంలో ప్రథమ స్థానం సంపాదిస్తాయన్నారు.

పలువురు ప్రముఖుల హాజరు

పలువురు ప్రముఖుల హాజరు

మిస్‌ ఇండియా ప్లానెట్‌ రష్మీ ఠాకూర్‌, సినీ నటి పూనం కౌర్‌, తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మిర్జా, ఒలింపిక్‌ పతక విజేత, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతో పాటు పోలీసు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూనం కౌర్

పూనం కౌర్

మిస్‌ ఇండియా ప్లానెట్‌ రష్మీ ఠాకూర్‌, సినీ నటి పూనం కౌర్‌, తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మిర్జా, ఒలింపిక్‌ పతక విజేత, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతో పాటు పోలీసు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మెహ్రీన్

మెహ్రీన్

మహా బతుకమ్మ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన నటి మెహ్రీన్.

మహా బతుకమ్మ వేడుక

మహా బతుకమ్మ వేడుక

ఈ కార్యక్రమానికి నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వ్యాఖ్యతగా మారి.. ఉత్సాహాన్ని నింపారు. డిప్యూటీ మేయర్‌ ఫసియుద్దీన్‌.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు స్వాగతం పలికారు. తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చే శక్తి ఉన్న బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేశామని సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బొర్రా వెంకటేశం అన్నారు. కేరళలో మళయాళీలు నిర్వహించిన ఓనం పండగలో ప్రత్యేకంగా మహిళలు పాల్గొనేలా చేసి 5211 మందితో గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కేలా గతంలో ప్రయత్నం జరగగా.. మహా బతుకమ్మ ఉత్సవం కేవలం మహిళలు ఆడే ఆటగా చరిత్ర సృష్టించిందన్నారు.

English summary
TRS MP Kavitha Participates in Bathukamma Celebrations at Sydney.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X