దిశా దశా లేని బడ్జెట్.. తెలంగాణను శత్రువుగా చూస్తారా? : కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీలు ఫైర్
పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2022 ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ రంగాలను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. లాభాల్లో ఉన్న సంస్థలను కూడా అమ్మేందుకు లైన్‌లో పెట్టారని ఆరోపించారు. తెలంగాణను కేంద్రం శత్రువుగా చూస్తోందని విరుచుకుపడ్డారు. బడ్జెట్ వలన రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడ్జెట్‌లో రైతులకు తీరని అన్యాయం
కేంద్రం అమృత కాల్ బడ్జెట్ వచ్చే 25 ఏళ్లకి అంటుంది..కానీ ఇప్పుడు చస్తున్నామని టీఆర్ఎస్ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు. బడ్జెట్‌లో రైతులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కరోనా సమయంలో కూడా వ్యవసాయ రంగం బాగుంది కాబట్టే మనకు ఆదాయం ఉందన్న విషయాన్ని కేంద్రం గ్రహించాలన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై గ్రామాల్లో కూడా చర్చ జరగాలన్నారు. అగ్రికల్చర్‌లో డిజిటల్‌ను ప్రోత్సహిస్తామంటూ మోసపూరిత మాటలతో ప్రజలను ఇంకా దగా చేయాలని చూస్తోందని నామా ఆగ్రహం వ్యక్తం చేశారు.

బడ్జెట్ నిధులన్నీ గుజరాత్‌కేనా.?
ఈ బడ్జెట్ కేవలం గుజరాత్ కోసమే ప్రవేశపెట్టినట్లు ఉందని నామా నాగేశ్వరరావు విమర్శించారు. గుజరాత్‌లో గిఫ్ట్ సిటీ గురించి మాత్రమే ప్రస్తావించారన్నారు. హైదరాబాద్‌కి కూడా గిఫ్ట్ సిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గిఫ్ట్ సిటీ ఇవ్వడానికి దేశంలో ఇంకా ఏ రాష్ట్రం లేదా అని కేంద్రాన్ని నామా ప్రశ్నించారు. ల్యాండ్ రికార్డులు అంటూ కొత్త పల్లవి కేంద్రం అందుకుందన్నారు. ఢిల్లీ నుంచి కంట్రోల్ చేయాలని చూస్తున్నారరా అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

దశా దిశా లేని బడ్జెట్
పార్లమెంటులో కేంద్రం దశా దిశా లేని బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని ఎంపీ కే . కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరాల అభివృద్ధికి ఎలాంటి కేటాయింపులు లేవన్నారు. పేదలకు ఈ బడ్జెట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. క్రిప్టో కరెన్సీ లీగల్ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై 30 శాతం టాక్స్ వేశారని పేర్కొన్నారు. తెలంగాణకు మొండి చెయి చూపించిందని మండిడ్డారు.
Recommended Video

తెలంగాణను శత్రువుగా చూస్తున్నారు..
తెలంగాణను కేంద్రం ఒక శత్రువుగా చూస్తుందని టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ నిరాశ మిగిల్చిందన్నారు. తెలంగాణ రాష్టానికి ఎలాంటి ప్రోత్సాహకాలు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాలకు 158 మెడికల్ కాలేజీలు కేటాయించారని, కానీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేటాయించలేదని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు దమ్ముంటే తెలంగాణకు రావాల్సిన నీటి వాటాతో పాటు జీఎస్టీ బకాయిలను ఇప్పించాలని ఆయన సవాల్ విసిరారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications