సందడిగా టీఆర్ఎస్ ప్లీనరీ; తెలంగాణా భవన్లో వేడుకలు; మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
టిఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీ కార్యక్రమం చాలా ఘనంగా మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన భావించిన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గులాబీ నేతలు ఈ నేపథ్యంలో సంబరాలు జరుపుకుంటున్నారు.
హెచ్ఐసీసీలో సందడిగా టీఆర్ఎస్ ప్లీనరీ
హెచ్ఐసీసీలో ప్లీనరీ సందర్భంగా 4,500 మందికి సరిపడే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్న టిఆర్ఎస్ పార్టీ నేతలు సీఎం కెసిఆర్ ప్లీనరీలో ఏం చెప్తారు అన్నదానిపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఘనంగా సంబరాలను నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.

తెలంగాణా భవన్ లో టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన కేటీఆర్
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల జెండాను కేటీఆర్ ఎగరవేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ కేక్ ను కట్ చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాణాసంచా కాల్చి తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్లీనరీ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు .తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి ఆపై ప్లీనరీని ప్రారంభించారు.

ప్లీనరీ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి దశ దిశ చూపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆనాడు ఆకలిచావులు, ఆత్మహత్యలతో ప్రశ్నార్థకంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు 12 రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులు పని చేసుకునేంత ఎత్తుకు ఎదిగింది అని హరీష్ రావు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెబుతున్న డబల్ ఇంజన్ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు వలస కూలీలు వస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

బీజేపీ హయాంలో అచ్చే దిన్ పోయి సచ్చే దిన్ వచ్చాయి
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఒక్క పనైనా చేసిందా అంటూ ప్రశ్నించిన హరీష్ రావు బండి సంజయ్ దేనికోసం పాదయాత్ర చేస్తున్నాడో చెప్పాలని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం తో ఏ వర్గానికి అయినా ఉపయోగం కలిగిందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కేవలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అని, బీజేపీ సంగతి ప్రజలకు మా కంటే ఎక్కువ తెలుసు అని హరీష్ రావు పేర్కొన్నారు.
అంతే కాదు బీజేపీ హయాంలో అచ్చే దిన్ పోయి సచ్చే దిన్ వచ్చాయని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. రైతులకు, నిరుద్యోగులకు కాషాయ పార్టీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు హరీష్ రావు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కంటే బాగుందో చూపెట్టాలని హరీష్ రావు ప్రశ్నించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications