వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిపక్షాలను బలహీనం చేసే టీఆర్ఎస్ షాకింగ్ ప్లాన్..వారితో బేరసారాలు; క్షేత్రస్థాయిలో జరుగుతుందిదే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు టిఆర్ఎస్ పార్టీ చెక్ పెట్టే ప్లాన్ లో ఉందా? అందుకోసం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిందా? ఇప్పటికే తెలంగాణలో జాతీయ నాయకులను దింపి రసవత్తర రాజకీయాల సాగిస్తూ, అధికార పక్షాన్ని గద్దె దించడం కోసం ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ఊహించని రీతిలో టిఆర్ఎస్ పార్టీ షాక్ ఇస్తుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. అసలు ఇంతకీ టిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలకు ఏ విధంగా చెక్ పెట్టే ప్లాన్ లో ఉందంటే..

ప్రతిపక్ష పార్టీల నేతలను ట్రాప్ చేస్తున్న టీఆర్ఎస్

ప్రతిపక్ష పార్టీల నేతలను ట్రాప్ చేస్తున్న టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసే పనిలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే పని మొదలు పెట్టింది. వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే కార్యరంగంలోకి దిగిన టిఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతిపక్షాలలో బలంగా ఉన్న నేతలను రండి బాబు రండి అంటూ పార్టీలోకి ఆహ్వానిస్తుంది.

ప్రతిపక్ష పార్టీల నుండి బలమైన నాయకులను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే, వచ్చే ఎన్నికల సమయానికి ప్రతిపక్షాలు నిర్వీర్యం అవుతాయని టిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ప్రతిపక్ష పార్టీల నేతలను ప్లాన్ ప్రకారం ట్రాప్ చేస్తుంది టిఆర్ఎస్.

ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులతో బేరసారాలు

ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులతో బేరసారాలు

టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు బంపర్ ఆఫర్ లను ప్రకటిస్తుంది. వారికి పనులు చేయాలన్నా, వారి అవసరాలు తీర్చుకోవాలన్న నిధులు తప్పనిసరి కావడంతో, శత్రువుగా ఉంటే సాధించలేరని, మిత్రుడిగా పనులు చేయించుకోవాలని, పార్టీలో చేరేందుకు ఆఫర్ ఇస్తోంది.

ప్రతిపక్ష పార్టీలో ఉండి కొట్లాడితే వచ్చేది ఏముందని, అధికార పక్షంలోకి వచ్చి నాలుగు రాళ్ళు వెనకేసుకోమని ప్రతిపక్ష పార్టీల నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. వార్డు సభ్యుడు నుంచి, మండల పరిషత్ జిల్లా పరిషత్ నేతల వరకు ప్రతి ఒక్కరికి వారి అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి బేరసారాలు చేస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేరికల వ్యూహం

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేరికల వ్యూహం

వచ్చే ఎన్నికల లోపు జోరుగా ప్రతిపక్ష పార్టీల నుండి నాయకులు గులాబీ కండువాలు కప్పుకోవాలని రచించిన వ్యూహంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లా లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అధికార పార్టీని బలోపేతం చేయడానికి, చేరికలకు ఆసక్తి చూపిస్తోంది టిఆర్ఎస్ పార్టీ. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూస్తే భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట తదితర నియోజకవర్గాలలో పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి.

గ్రామస్థాయిలో పార్టీలోకి ఆహ్వానాలు .. జోరుగా ప్రలోభాలు

గ్రామస్థాయిలో పార్టీలోకి ఆహ్వానాలు .. జోరుగా ప్రలోభాలు


గ్రామస్థాయిలో వార్డు మెంబర్ల నుండి, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ ఇలా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు పార్టీలో చేరి కోసం బేరసారాలు కూడా జరుగుతున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతోంది. వారి అవసరాన్ని బట్టి లక్షల రూపాయలు ఇచ్చి , వారికి నిధులు, చేసుకునే పనుల విషయంలో సహకరిస్తామని బేరాలు చేస్తూ పార్టీలో చేర్చుకుంటుంది. ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టేందుకు సర్వ శక్తులను ఒడ్డుతూ గులాబీ శ్రేణులు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నాయి.

Recommended Video

Telangana: రేవంత్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు Srinivas Slams Balka Suman | Telugu Oneindia
మళ్ళీ అధికారంలోకి రావటానికి టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్

మళ్ళీ అధికారంలోకి రావటానికి టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్

ఎన్నికల సమయానికి పార్టీలో నూతన ఉత్సాహాన్ని తీసుకురావడానికి, ప్రతిపక్ష పార్టీలను బలహీనం చేసి పార్టీలో బలమైన నాయకులు ఎవరూ లేరు అని చూపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే రెండు దఫాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలు మరోమారు తమకు అవకాశం ఇస్తారా లేదా అన్న సంశయంలో, ప్రజల మద్దతు కూడగట్టడం పైనే కాకుండా, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం పైన కూడా టిఆర్ఎస్ పార్టీ మాస్టర్ ప్లాన్ లు వేస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు వచ్చే ఎన్నికలలో హోరాహోరీ పోరు సాగుతుంది అన్న సంకేతాన్ని ఇస్తున్నాయి.

English summary
TRS has laid out a shocking plan to weaken the opposition. At the field level, trs party trapping public representatives of opposition parties and giving them bumper offers. Focused on inclusions across the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X