రూ 500కే గ్యాస్ సిలిండర్ పథకం లబ్దిదారుల ఎంపికపై తాజా నిర్ణయం..!!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలు పై కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వీటిలో రెండు పాక్షికంగా అమలు ప్రారంభించింది. మిగిలిన వాటిలో రూ 500 గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకం పైక కదలిక వచ్చింది. దీని పైన పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి అమలు పై ప్రతిపాదనలు అందించారు. ఇందులో కీలక సూచనలు చేసారు.

మరో పథకం అమలు : మహిళలకు నాడు ఇచ్చిన మహాలక్ష్మీ పథంలో కీలక మైన సబ్సిడీ పైన గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం పైన ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. తాజాగా అధికారులు రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారినే ఈ పథకంలో లబ్దిదారులుగా ఎంపిక చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా లబ్దిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నెల 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. వంద రోజుల్లోగా హామీలు అమలు చేయాల్సి ఉంది. రూ 500 గ్యాస్ సబ్సిడీ పథకానికి రేషన్ కార్డునే ప్రామణికంగా తీసుకొనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులతో నిమిత్ం లేకుండా లబ్దిదారులను ఎంపిక చేయాలనే ప్రతిపాదన ఉన్నా..అది మరింత ఆలస్యం అవుతుందని భావిస్తున్నారు.

TS Govt begin Exercise to fix guide lines for implementation of Rs 500 subsidy on LPG Cylinder

అధికారుల సూచనలు : తెలంగాణలో ప్రస్తుతం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా, రేషన్ కార్డుల సంఖ్య 89.98 లక్షలుగా ఉంది. గివ్ ఇట్ అప్ లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. వీరిని మినహాయిస్తే 85.79 లక్షల మంది లబ్దిదారులు ఉంటారు. రేషన్ కార్డు డేటాబేస్ తో మ్యాపింగ్ అయిన గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలుగా ఉంది. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు రూ 340 రాయితీ అందుతోంది. మొత్తం కనెక్షన్లలో ఇవి 11. 58 లక్షలు ఉన్నాయి. రాయితీ సిలిండర్లను సంవత్సరానికి ఆరు లేక 12 ఇవ్వాలా...అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ఇందు కోసం అర్హుల కుటుంబంలోని సభ్యుల సంఖ్య..గత ఏడాది వాడిన సిలిండర్ల సంఖ్య..వంటి అంశాలను పరిగణలోకి తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
TS Govt begin Exercise to fix guide lines for implementation of Rs 500 subsidy on LPG Cylinder

సీఎం రేవంత్ నిర్ణయం : రాష్ట్రంలో ప్రతీ నెలా సిలిండర్ పొందుతున్న వారి సంఖ్య 44 శాతం మంది మాత్రమే ఉన్నారు. కొత్త కార్డులు పొందేవారికీ ఈ పథకం అమలు చేస్తారని చెబుతున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లను పరిగణలోకి తీసుకోవద్దని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో..ఈ నెల 28వ తేద నుంచి ఈ పథకం ప్రారంభించాలని తొలుత నిర్ణయించారు. ఇప్పటి వరకు విధి విధానాలు ఖరారు కాకపోవటంతో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది ఈ రోజు జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+