TS poll results: కామారెడ్డిలో సంచలనం, ఆధిక్యంలోకి బీజేపీ అభ్యర్థి, తర్వాత రేవంత్, కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిపోల్‌ను నిజం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ దిశగా సాగుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో సీనియర్ రాజకీయ నాయకులకు కూడా పరాభవం ఎదురవుతోంది. ఇక, తెలంగాణ ఎన్నికల్లో అత్యంత ప్రధాన్యం సంతరించుకున్న కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి హవా సాగంది.
కానీ, ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి వెంకటరమణ రెడ్డి ముందజలో ఉన్నారు. సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటాపోటీగా ఎన్నికల బరిలో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రేవంత్ లీడ్లో ఉండగా ప్రస్తుతం వెంకటరమణరెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు.

14 రౌండ్ల అనంతరం బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి 1717 ఓట్లతో మెజారిటీతో ఉన్నారు. ఆయన తర్వాత రెండో స్థానంలో రేవంత్ రెడ్డి లీడ్లో ఉన్నారు. మూడో స్థానంలో సీఎం కేసీఆర్ ఉండటం గమనార్హం. మరోవైపు, గజ్వేల్ నియోజకవర్గంలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసిన రేవంత్ రెడ్డి విజయం సాధించారు.
ఇక తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తోంది. ఇప్పటికే 31 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 30 స్థానాల్లో ముందుంజలో ఉంది. మొత్తం 119 స్థానాల్లో 60 స్థానాలు వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
మరోవైపు, అధికార బీఆర్ఎస్ పార్టీకి కేవలం 40 స్థానాలకే పరిమితమైంది. 28 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 11 స్తానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గట్టి పోటీ ఇస్తుందనుకున్న బీజేపీ 8 స్థానాలకే పరిమితమవుతోంది. ఇప్పటికే 4 స్థానాల్లో విజయం సాధించగా.. మరో నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎంఐఎం 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఒక స్థానంలో గెలిచింది.












Click it and Unblock the Notifications