ఆ ఒక్కటి చూపిస్తే చాలు.. వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
తెలంగాణలో రేపటి(ఫిబ్రవరి 25) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరంలో 4,89,126 మంది.. అలాగే రెండో సంవత్సరంలో 5,07,949 మంది కలిపి మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అయితే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులకు ఊరటను కలిగిస్తూ.. తొలిసారి గ్రేస్ పీరియడ్ గా 5 నిమిషాలను కేటాయించారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 9:05 నిమిషాల వరకూ కేంద్రంలోకి అనుమతించనున్నారు.
ఇక విద్యార్థులు సకాలంలో ఎగ్జామ్ సెంటర్ లకు చేరుకునే విధంగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు.. తమ హాల్ టికెట్, కన్షెషనల్ పాస్ చూపిస్తే ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చారు. పాస్ లో ఉన్న ప్రాంతం వరకే కాకుండా ఎగ్జామినేషన్ కేంద్రం వరకు విద్యార్థులు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయవచ్చని అధికారులు స్పష్టం చేసింది. విద్యార్థులు.. వారి ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వరకూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. అమ్మాయిలకు ఎలాగూ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఉన్న విషయం తెలిసిందే.
ఇంటర్ పరీక్షలు రాసే అబ్బాయిలు.. తమ హాల్ టికెట్, పాస్ చూపిస్తే ఎక్కడినుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించింది తెలంగాణ ఆర్టీసీ. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఈ వెసులుబాటు అన్ని పరీక్షలకు వర్తిస్తుందని.. అలాగే ప్రభుత్వ సెలవు దినాలు, ఆదివారాలు కూడా ఈ వెసులుబాటు వర్తిస్తుందని TGSRTC పేర్కొంది.

అయితే ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ. 20 చెల్లించి కాంబో టికెట్ తో విద్యార్థులు ప్రయాణం చేయవచ్చని స్పష్టం చేసింది. ఇక బస్ పాస్ లేని విద్యార్థులు సాధారణ టికెట్ తీసుకుని ప్రయాణించాలని TGSRTC పేర్కొంది. అలాగే విద్యార్థుల సౌలభ్యం కోసం బస్సులను ఎక్కడైనా ఆపాలని అధికారులకు సూచనలు చేసింది.
-
ఉచిత బస్సు ప్రయాణం లో కీలక మార్పు, ఇక ఆ కష్టాలకు చెక్..!! -
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications