TSPSC పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన డాక్యా..
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులను సిట్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డాక్యాను సిట్ విచారిస్తుంది. సిట్ విచారణలో రోజుకో పేరు తెరపైకి వస్తుంది. లీకైన పేపర్లు ఒకరి నుంచి ఒకరికి చాలా మందికి చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మొదటగా ప్రవీణ్ నుంచి రేణుక పేపర్లు తీసుకుంది. ఆ తర్వాత రేణుక, డాక్యా దంపతులు తమ బంధువులు నీలేష్, గేపాల్ రూ.14 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఇందులో ప్రవీణ్ కు రూ. 10 లక్షలు ఇచ్చారు. అడ్వాన్స్ గా రూ.5 లక్షలు, తర్వాత రూ.5 లక్షలు ఇచ్చారు. అయితే ప్రవీణ్ రేణుకకు పేపర్లు ఇచ్చేటప్పుడు ఎక్కువ మందికి లీక్ చేయ్యొద్దని కోరాడు.

దీంతో ఆమె ఇద్దరికే పేపర్లు అమ్మింది. భార్య రేణుకకు తెలియకుండా మరికొందరికి పేపర్లు అమ్మాడు డాక్యా. మధ్యవర్తి తిరుపతయ్య ద్వారా రాజేంద్రకుమార్, ప్రశాంత్ రెడ్డికి డాక్యా పేపర్లు అమ్మాడు. ఈ విషయం భార్యకు తెలువకూడదని వారిని మార్చి 4న ఓ లాడ్జికి పిలిపించి పేపర్లు ఇచ్చాడు.
సిట్ ప్రశాంత్ రెడ్డి, రాజేంద్ర కుమార్ లను ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. సోమవారం తిరుపతయ్యను అరెస్ట్ చేసింది. వీరిని కస్టడీలోకి తీసుకుని వేచారించే అవకాశం ఉంది. ఏఈ పేపరే కాకుండా గ్రూప్-1 పేపర్ ఎవరెవరికీ లీక్ అయిందనేదానిపై సిట్ దర్యాప్తే గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100కు పైగా మార్కుల వచ్చిన 121 మందిలో ఇప్పటికే 53 మందిని విచారించింది. ఈ 53 మందికి సమర్ధతను పరీక్షించడానికి ఎఫీషియెన్సీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం.
న్యూజిలాండ్ లో ఉన్న రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్ కు గ్రూప్-1 పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతను పరీక్ష అనంతరం న్యూజిలాండ్ వెళ్లాడు. అతనికి సిట్ వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేసింది. అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications