ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్, తొలిగిన అడ్డంకి - సభలో అధికారికంగా..!!
ఎట్టకేలకు అనేక తర్జన భర్జనల తరువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ముసాయిదా బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేసారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించిన తరువాత గవర్నర్ ఆమోద ముద్రకు ఆలస్యం కావటంతో ఉత్కంఠ పెరిగింది. బిల్లులోని పలు అంశాల పైన గవర్నర్ వరుసగా క్లారిఫికేషన్లు తీసుకున్నారు. చివరగా ఆర్టీసి అధికారులతో చర్చల తరువాత ముసాయిదా ఆమోదించారు.
గవర్నర్ ఆమోదంతో: తెలంగాణ అసెంబ్లీలో మరో చారిత్రక నిర్ణయానికి సమయం ఆసన్నమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం అమలుకు అడ్డంకులు తొలిగిపోయాయి. మూడు రోజులు సాగుతున్న సస్పెన్స్ కు తెర పడింది. అనేక చర్చల తరువాత గవర్నర్ తమిళసై బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లును ఈ రోజు సభలో ఆమోదించే అవకాశం ఉంది.

ఈ రోజుతో సమావేశాలు ముగస్తున్న వేళ ఈ బిల్లు పైన ఉత్కంఠ కొనసాగుతోంది. బిల్లుపైన సందేహాలు ఉన్నాయని..వాటికి సమాధానం వచ్చిన తరువాత ఆమోదం తెలుపుతామని గవర్నర్ చెబుతూ వచ్చారు. దీని పైన ప్రభుత్వానికి మూడు దఫాలుగా తన సందేహాల ను పంపారు. వీటికి ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
అసెంబ్లీకి విలీనం బిల్లు: ఈ రోజు ఉదయం తాత్కాలిక ఉద్యోగుల విషయంలో మరింత స్పష్టత కోరుతూ రవాణా శాఖ కార్యదర్శిని రాజ్ భవన్ కు రావాలని గవర్నర్ సూచించారు. దీంతో, తెలంగాణ రవాణా శాఖ కమిషన్ నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి అన్ని విషయాల పైన స్పష్టత ఇచ్చారు. దీంతో వెంటనే గవర్నర్ అక్కడే బిల్లు ముసాయిదాకు ఆమోదం తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగుతున్నాయి. ఈ రోజు సమావేశాల కు చివరి రోజు. బిల్లు ముసాయిదాకు గవర్నర్ ఆమోద ముద్ర వేయటంతో ఈ రోజునే సభలో బిల్లును ప్రతిపాదించి..ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో తన తొమ్మిదేళ్ల పాలన పైన చర్చకు సమాధానం ఇవ్వనున్నారు.
Various #TSRTC Employees unions said, they are happy about the continuous concern shown by the Hon'ble Governor about wellbeing and protecting their interest.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 5, 2023
TSRTC ఉద్యోగులు మాట్లాడుతూ, గౌరవనీయమైన గవర్నర్ గారు మా సంక్షేమం మరియు మా ప్రయోజనాలను పరిరక్షించడంపై చూపుతున్న నిరంతర… pic.twitter.com/VeJ2klwj56
చారిత్రాత్మక నిర్ణయంగా: తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయం పైన గవర్నర్ వెంటనే సంతకం చేయాలని కార్మికులు నిరసనకు దిగారు. రెండు గంటలు బస్సులు ఆపారు. రాజ్ భవన్ ముందు బైఠాయించారు. తాను ఆర్టీసి బిల్లుకు వ్యతిరేకం కాదని గవర్నర్ స్పష్టం చేసారు. కార్మికుల భవిష్యత్ ప్రయోజనాల కోసమే వివరణ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
ఈ రోజు నేరుగా అధికారులతో సమావేశం తరువత వెంటనే గవర్నర్ ముసాయిదా బిల్లుకు అంగీకారం తెలిపారు. దీంతో, సభలో బిల్లును ప్రతిపాదించేందుకు అంగీకారం లభించింది. ఈ బిల్లు ఈ రోజు శాసన సభ, శాసన మండలిలో ప్రవేశ పెట్టి ఆమోదించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీంతో, ఈ రోజు అసెంబ్లీలో మరో కీలక నిర్ణయానికి ఆమోదం లభించటం లాంఛనంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications