ఇక వజ్ర బస్సులు: మహేందర్ రెడ్డి
ప్రజా రవాణా వ్యవస్థను మరింత విస్తరించి ప్రజలకు చేరువగా తీసుకుపోయే లక్ష్యం తో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాలకు, డిమాండ్ ఉన్న ఇతర ప్రాంతాలకు కొత్తగా 100 ఏసీ మినీ బస్సులను ప్రవేశపెడుతున్నది. 21 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ వజ్ర బస్సులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నవంబర్ నెలాఖరులో ప్రారంభించనున్నారు. తొలుత దసరాకు, ఆ తర్వాత దీపావళినాటికి ఈ మహేంద్ర కంపెనీ బస్సులను రోడ్లమీద పరుగులు పెట్టించాలని భావించినప్పటికీ ఇటీవలి వర్షాలు, సాంకేతిక కారణాలతో ఆలస్యమవుతున్నది. నవంబర్ నెలాఖరునాటికి బస్సులను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు.












Click it and Unblock the Notifications