బీజేపీ నాయకులు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటున్న తుల ఉమా!!

వేములవాడ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. వేములవాడలో బిజెపి అభ్యర్థిగా ప్రకటించిన తులా ఉమకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వేములవాడ బరి నుంచి వికాస్ రావు బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తుల ఉమ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

తనకు బిజెపి అన్యాయం చేసిందని వెక్కి వెక్కి ఏడ్చిన తులా ఉమా, తనకు ఫోన్ చేసే బిజెపి నేతలను చెప్పుతో కొడతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిజెపిలో బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని, అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తున్నారని తులా ఉమా ఆరోపించారు. అసలు బిజెపిలో మహిళలకు స్థానం లేదని పేర్కొన్న తులా ఉమా, నమ్మించి మోసం చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Tula Uma says she will slap BJP leaders if they call her!!

బిజెపి నాయకులు ఎవరైనా తనకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానని తుల ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక దొర అహంకారంతో బయటకు వచ్చానని పేర్కొన్న తులా ఉమా, తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నానని, కానీ చివరి నిముషంలో మోసం చేశారన్నారు. దొరల వద్ద చేతులు కట్టుకొని ఉండలేనని పేర్కొన్న ఆమె, అక్కడ నుండి వస్తే బీజేపీలో కూడా అలాగే తొక్కే కుట్ర జరుగుతుందన్నారు.

తను ఏ పార్టీ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఇక వేములవాడ ప్రజల అభిప్రాయం మేరకు తన నిర్ణయం ముందు ముందు ఉంటుందని తులా ఉమా స్పష్టం చేశారు. బిజెపి కుటుంబ పాలనకు వ్యతిరేకమన్నారు కానీ దొరల కాళ్ళ దగ్గర బీఫామ్ పెట్టి వచ్చాడు ఎంపీ బండి సంజయ్ అంటూ తులా ఉమా మండిపడ్డారు.

నా కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించారని మండిపడిన తుల ఉమా, బీజేపీకి సిద్ధాంతాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. బిజెపి బిసి ముఖ్యమంత్రి అనేది బూటకమని పేర్కొన్న తుల ఉమా బిజెపిలో సిద్ధాంతాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని తుల ఉమా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+