weather: హైదరాబాద్ తోపాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, అలర్ట్, పోలీసుల సూచన

హైదరాబాద్: గత రెండు మూడు రోజులుగా తెరిపినిచ్చిన వానలు.. మళ్లీ కురుస్తున్నాయి. షియర్ జోన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్ తోపాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్ తోపాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం, శనివారం హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉదయం నుంచే సిటీలో భారీ వర్షం

ఉదయం నుంచే సిటీలో భారీ వర్షం

కాగా, శుక్రవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌ నగరంలో వర్షం కురుస్తోంది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, ఎల్బీనగర్, చైతన్యపురి, వనస్థలిపురం, పనామా, అబ్దుల్లాపూర్‌మెట్, నాంపల్లి, సికింద్రాబాద్, చాంద్రాయణగుట్ట, పాతబస్తీ, అమీర్‌పేట, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, లక్డీకపూల్, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చర్లపల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్‌పల్లిలో వంటి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ఇంకా జల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

 భారీ వర్షాలతో నగరజీవికి ఇబ్బందులు.. పోలీసుల సూచనలు

భారీ వర్షాలతో నగరజీవికి ఇబ్బందులు.. పోలీసుల సూచనలు

ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండటం వల్ల పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు రహదారులపైకి చేరడంతో వాహనదారులు అవస్థలు తప్పలేదు.ఇప్పటికే భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నగర ప్రజలు.. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారంతో వివిధ విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇవాళ, రేపు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. అవసరముంటేనే బయటికి రావాలని, వర్షం తగ్గిన వెంటనే రోడ్లపైకి రాకూడదని సూచించారు. వర్షం తగ్గిన కాసేపటికి రోడ్లపైకి రావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+