తెలంగాణలో నిఫా వైరస్ లేదు: ఆ ఇద్దరి టెస్ట్ నెగిటివ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిఫా వైరస్ లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. విషజ్వరాలతో బాధ పడుతున్న ఇద్దరికి కేవలం అనుమానంతో చేసిన పరీక్షలు నెగెటివ్‌గా వచ్చాయని చెప్పారు.
వారి నమూనాలను పుణెలోని ఐసీఎంఆర్‌లో పరీక్షలు చేయించినట్లు చెప్పారు. ఒకరు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు చికిత్సకు వెళ్ళగా ఫీవర్ ఆసుపత్రికి పంపించారని, నమూనాలు సేకరించి పరీక్ష నిర్వహించగా నిఫా వైరస్ లేనట్లు తేలిందని మంత్రి చెప్పారు. బాధితుడికి టైఫాయిడ్ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారని, ప్రత్యేక వార్డులో చేర్పించి వైద్యం అందించి.. ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి పంపించారన్నారు.

తీవ్ర జ్వరంతో బాధపడుతూ మరో వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడని, అనుమానంతోనే నిఫా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సదరు బాధితుడు మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా వైద్యులు గుర్తించారని, ఆయనకు శస్త్ర చికిత్స చేయడానికి నిర్ణయించినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు.
ప్రజలు ఎలాంటి అనుమానాలు, అపోహలకు పోవద్దని మంత్రి తెలిపారు. అన్ని రకాలుగా వైద్య శాఖ సిద్ధంగా ఉండటంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications