మరో రెండు చోట్ల, భర్తలను చంపిన భార్యలు: ఓ చోట తండ్రితో కలిసి

Posted By:
Subscribe to Oneindia Telugu

ఖమ్మం: మరో రెండు చోట్ల ఇద్దరు మహిళలు తమ భర్తలను చంపేశారు. ఇప్పటి వరకు వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తలను చంపిన సంఘటనలు చదివాం. ఇప్పుడు కుటుంబ కలహాల కారణంగా, రోజు వేధిస్తున్నాడనే కోపంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు భర్తలు హత్యకు గురయ్యారు.

అక్కకు ద్రోహం, బావతో సంబంధం: భర్తను చంపిన శ్రీవిద్య నవ్వుతూ, షాకింగ్ విషయాలు

కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా పంచాయతీలోని సామ్యాతండాలో బుధవారం ఓ భార్య తన భర్త గొంతు నులిమి చంపింది. బానోతు శ్రీనుకు లక్ష్మీతో పదిహేనేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లక్ష్మీ కూరగాయలు అమ్ముతుండగా, శ్రీను వ్యవసాయ కూలి.

 మద్యానికి బానిసై

మద్యానికి బానిసై

భర్త శ్రీను అప్ప్డప్పుడు రైల్వే పనులకు కూడా వెళ్తుంటాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. తరుచూ తాగి వచ్చి లక్ష్మీని వేధించేవాడు. ఈ వేధింపులు తాళలేక బుధవారం వేకువజామున మద్యం మత్తులో ఉన్న భర్త మెడకు చీర బిగించి హతమార్చింది భార్య. కాసేపటి తర్వాత నిద్రలేచిన పెద్దకూతురుతో మాట్లాడింది.

బంధువులకు చెప్పడంతో

బంధువులకు చెప్పడంతో

వేధింపులు భరించలేక మీ నాన్నను చంపేశానని లక్ష్మీ తన కూతురుకు చెప్పింది. దీంతో ఆమె భయంతో సమీపంలో ఉండే పిన్ని ఉషకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆమె బంధువులకు విషయం చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. భర్త వేధింపులు తాళలేకే చంపినట్లు ఆమె పోలీసు స్టేషన్‌కు వెళ్లి చెప్పింది.

 మరో ఘటనలో

మరో ఘటనలో

మరో ఘటనలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రాంనగర్‌కు చెందిన కొర్స దేవయ్య.. భార్య, మామ చేతిలో హత్యకు గురయ్యాడు. దేవయ్య చత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చాడు.

 తండ్రితో కలిసి భర్త హత్య

తండ్రితో కలిసి భర్త హత్య

దేవయ్యకు కొంతకాలం క్రితం కొర్స లక్ష్మీతో వివాహం జరిగింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి దేవయ్య భార్యతో గొడవపడ్డాడు. గొడవతో వేగలేక లక్ష్మీ, తన తండ్రి నందయ్యతో కలిసి మంగళవారం రాత్రి దేవయ్యను కర్రతో తలపై బలంగా కొట్టి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman allegedly throttled her husband to death annoyed over his “constant harassment” at Bhagyanagar Tanda in Karepalli mandal in the small hours of Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి