అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల భారీ నిరసన: సొమ్మసిల్లిన యువతి, హరీశ్ హెచ్చరిక
హైదరాబాద్: గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచాలని, ప్రస్తుత పరీక్షలను వాయిదా వేయాలంటూ అశోక్ నగర్‌లో భారీ సంఖ్యలో నిరుద్యోగులు రాస్తారోకో నిర్వహించారు. చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బైఠాయించి నిరసన తెలియజేశారు.
ఈ రాస్తారోకో కార్యక్రమంలో ఓ నిరుద్యోగ యువతి సొమ్మసిల్లి పడిపోయింది. అభ్యర్థుల ఆందోళనతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు గ్రూప్ 2 లేదా గ్రూప్ 1కు మాత్రమే సిద్ధం కావాల్సి వస్తుందని, ఒక పరీక్ష కోల్పోవటం జరుగుతుందని వాపోయారు. డీఎస్సీ పరీక్ష కూడా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

గ్రూప్ 2, గ్రూప్ 3 షెడ్యూల్ ఒకే సమయానికి ఉండటం వల్ల ఈ రెండింటి పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2 డిసెంబర్లో నిర్వహిస్తే గ్రూప్ 1 మెయిన్స్‌కు ప్రిపరేషన్‌కు టైమ్ ఉంటుందన్నారు. ఈ ధర్నాకు భారీస్థాయిలో నిరుద్యోగులు హాజరై తమ నిరసనను తెలిపారు.
#WATCH | Telangana: A large number of unemployed youth, including Group II and DSC aspirants staged a protest against the state government at Ashok Nagar in Hyderabad. pic.twitter.com/JL4ldWewuB
— ANI (@ANI) July 13, 2024
మొర ఆలకించాలంటూ రేవంత్ సర్కారుకు హరీశ్ ట్వీట్
నిరుద్యోగుల నిరసనపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. 'గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర ఆలకించాలని రేవంత్ రెడ్డిని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భేషజాలకు పోకుండా, వారి జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నాను అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర ఆలకించాలని రేవంత్ రెడ్డి గారిని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భేషజాలకు పోకుండా, వారి జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరుతున్నాను.
— Harish Rao Thanneeru (@BRSHarish) July 13, 2024
గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలుచుకొని వారి బాధను,… pic.twitter.com/Ps40y3sZQq
గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలుచుకొని వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని వారిని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడి అబాసుపాలు కాకండి. వారు దైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించకండి అని రేవంత్ సర్కారును కోరారు.
పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం ఫలించక పొగా, అది మరింత ఉదృతం అవుతుంది. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసినా, వారిపై భౌతిక దాడులకు పాల్పడినా మేము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు హరీశ్ రావు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications