టీఆర్ఎస్‌లో పెరుగుతున్న లొల్లి... ఆసుపత్రి పాలైన మరో నేత

Recommended Video

    Telangana Elections 2018 : ఎన్నికల వేడి..ఆసుపత్రి పాలైన మరో టీఆర్ఎస్‌ నేత | Oneindia Telugu

    హైదరాబాద్ : తెలంగాణల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఆయా పార్టీలు. కొన్ని చోట్ల తమకు టికెట్ రాలేదని అసంతృప్తులు బయటపడుతున్నారు. కొందరిని పార్టీ అధిష్టానాలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంటే మరికొందరు మాత్రం తమ భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ కొందరినేతలకు ఆయా పార్టీలు మంచి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో ఆ నాయకులు సర్దుకుని పోతున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించి సవాలు విసిరారు. ఇందులో టికెట్ రాని కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఇలాంటి పరిస్థితి అన్ని పార్టీల్లో కనిపిస్తోంది.

    టీఆర్ఎస్ పార్టీ అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే తమ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. బీఫారాలు దక్కడంతో అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ పార్టీలో కొందరు అసంతృప్తులు బయటపడ్డారు. తాజాగా ఖైరతాబాద్ టికెట్ తనకు కేటాయించాలంటూ మన్నె గోవర్ధన్ రెడ్డి నిన్న తెలంగాణ భవన్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఖైరతా‌బాద్ టికెట్ తనకే కేటాయించాలంటూ తెలంగాణ భవన్ ముట్టడికి తన అభిమానులతో కలిసి బయలుదేరారు మన్నె గోవర్ధన్ రెడ్డి. అయితే మన్నె గోవర్దన్ రెడ్డిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులకు గోవర్దన్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని స్వల్ప తోపులాట జరిగింది.

     Unhappy TRS leader Manne Govardhan Reddy falls ill, admitted in Hospital

    పోలీసులకు, మన్నె గోవర్ధన్ అభిమానులకు మధ్య జరిగిన తోపులాటలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు మన్నె గోవర్ధన్ రెడ్డి. దీంతో వెంటనే మన్నె గోవర్దన్‌ను దగ్గరలోని సిటీ న్యూరో సెంటర్‌ హాస్పిటల్‌కు తరలించారు. గోవర్దన్ రెడ్డికి స్వల్ప గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. గోవర్దన్ రెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై నిరసనగా ఓ కార్యకర్త హాస్పిటల్ ముందు తన తలను బద్దలు కొట్టుకున్నాడు. హాస్పిటల్ ముందు మన్నె గోవర్దన్ రెడ్డి అనుచరులు ధర్నాకు దిగారు. అయితే ఇలా ఇంకా ఎంతమంది అసంతృప్తులు బయటకొస్తారోనని గులాబీ పార్టీల గుబులు పట్టుకుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+