రాజీనామాపై తొందరెందుకు? కేసీఆర్ చర్చకు సిద్ధమా.. కిషన్ రెడ్డి సవాల్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తో దేశ ఆర్థిక పరిస్థితి పై చర్చకు తాను సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు
తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి పై కేసీఆర్ ఆరోపణలు అవగాహన రాహిత్యమని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ తో దేశ ఆర్థిక పరిస్థితి పై చర్చకు తాను సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

ఎక్కడ చర్చ పెడదాం .. కిషన్ రెడ్డి సవాల్
ప్రెస్ క్లబ్లో చర్చకు వస్తారా.. అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర చర్చకు వస్తారా? లేక మీ ప్రగతి భవన్ కు లేదా ఫామ్ హౌస్ కు చర్చకు రమ్మంటారా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని వస్తారా? ఎలా వస్తారో కూడా చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు. అయితే చర్చకు రావడానికి తనకేమీ అభ్యంతరం లేదని చర్చకు తన తరుపున ఒకటే షరతుని పేర్కొన్న కిషన్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబ భాషలో కాకుండా గౌరవప్రదమైన తెలంగాణ భాషలో చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

ప్రధానికి తిట్టటానికే సమావేశాలు పెట్టినట్టు ఉన్నారు
నిన్న అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధాని నరేంద్ర మోడీపై కేసీఆర్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఎటాక్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశ అభివృద్ధి గురించి మాట్లాడుతున్న కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ధరణి పోర్టల్ పైన ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రధాని నరేంద్ర మోడీని తిట్టడానికే పెట్టినట్టుగా ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కు ఎందుకంత తొందర.. రాజీనామా లేఖ ఇవ్వక తప్పదు
ఇక రాజీనామా చేస్తానన్న కేసీఆర్ కు ఎందుకంత తొందర.. ఎన్నికల తరువాత రాజభవన్ కు రాజీనామా లేఖ ఇవ్వక తప్పదు అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఇతర దేశాలతో పోలుస్తూ విమర్శించడం కల్వకుంట కుటుంబానికే సరిపోయిందని కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ కాంగ్రెస్ ను పొగడడం, ప్రధానిని తిట్టడంతోనే సరిపోయిందని అసలు మండలిలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసింది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు.

కెసిఆర్ తన వ్యక్తిగత ప్రాధాన్యత పెంచుకోవటానికి ఇదంతా చేస్తున్నారు
కాంగ్రెస్ పార్టీలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నది ఎవరో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలదీశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతున్నట్టు తెలుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తనవ్యక్తిగత ప్రాధాన్యత పెంచుకోవటానికి, ప్రజలను తప్పుదోవ పట్టించటానికే దేశం ఆర్ధిక రంగం సంక్షోభంలో ఉందన్న తప్పుడు సంకేతాలు ఇస్తున్నారనీ కిషన్ రెడ్డి ఆరోపించారు.
దేశం జిడిపి వృద్ధిలో గతంలో 11 వ స్థానంలో ఉండగా, ఇటీవల్ యూకే ను వెనక్కి నెట్టి 5 వ స్థానానికి చేరిందని, నరేంద్ర మోదీ దేశంలో సంక్షోభ పరిస్థితులనుంచీ దేశాన్ని బయటకు తెచ్చారని అన్నారు.
దేశ ఆర్దికాభివృద్ధి చెప్పి బహిరంగ చర్చకు సవాల్
ఐ ఎం ఎఫ్ అంచనాల ప్రకారం 2027 లో దేశం 4 వ స్థానానికి చేరుతుందని చెప్పినట్లు పేర్కొంటూ, దేశాన్ని, ప్రజలను అవమానిస్తున్నారనీ మంత్రి ఆరోపించారు. పన్నులు కట్టే ప్రజలను కించపరచవద్దని సూచించారు. ఉత్పత్తి రంగంలో కూడా ప్రపంఛంలోనే దేశం 5 వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్, సింగపూర్, శ్రీలంక లాంటి దేశాల ఆర్ధిక వ్యవస్థలతో భారత ఆర్ధిక వ్యవస్థను పోల్చటం పట్ల మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్థపై బహిరంగ చర్చకు రావాలని, సమయాన్నీ, స్థలాన్నీ తెలియజేయాలనీ మంత్రి కిషన్ రెడ్డి డిమాండు చేశారు.
తనను విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదు
ప్రాజెక్టుల పేరిట రాష్ట్రంలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర అప్పు 60 వేల కోట్లు ఉంటే ఇప్పుడు ఐదు లక్షల కోట్లకు పెరిగిందని కిషన్ రెడ్డి విమర్శించారు. తనని విమర్శించే హక్కు కేసీఆర్ కు లేదని తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ఎన్నోసార్లు లేఖలు రాసినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం రాలేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications