కెసిఆర్ హామీ: తెలియదని కేంద్రమంత్రి షాకిచ్చారు, కవితతో.. (పిక్చర్స్)
హైదరాబాద్: విద్య, ఉద్యోగాల్లో ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ల పైన ప్రతిపాదనలు రాలేదని కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి నజ్మాహెఫ్తుల్లా సోమవారం నాడు చెప్పారు.
ప్రతిపాదన వస్తే తాము అప్పుడు పరిశీలిస్తామని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లీంల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.
కాగా, తాము అధికారంలోకి వస్తే 12 శాతం రిజర్వేషన్లు ముస్లీంలకు ఇస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సార్వత్రిక ఎన్నికల సమయంలో చెప్పిన విషయం తెలిసిందే.

ఆదివారంనాటి ఓ కార్యక్రమంలో కవిత, నజ్మాహెఫ్తుల్లా, అలీ
మైనార్టీల సంక్షేమం కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు తప్ప చేతల్లో... చేసిందేమీ లేదని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా విమర్శించారు.

ఆదివారంనాటి ఓ కార్యక్రమంలో కవిత, నజ్మాహెఫ్తుల్లా, అలీ
హైదరాబాద్‌లో ఆమె సోమవారం బిజెపి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆమెను ఘనంగా సత్కరించారు.

ఆదివారంనాటి ఓ కార్యక్రమంలో కవిత, నజ్మాహెఫ్తుల్లా, అలీ
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ బిజెపి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.

ఆదివారంనాటి ఓ కార్యక్రమంలో కవిత, నజ్మాహెఫ్తుల్లా, అలీ
దేశాన్ని నైపుణ్య భారత్‌గా చూడాలన్నదే ప్రధాని మోడీ స్వప్నమన్నారు. వక్ఫ్ స్థలాల కబ్జాను సహించేది లేదని, వాటి ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications