కేసీఆర్‌పై సమైక్యవాదుల కుట్రలు.. గుత్తా సుఖేందర్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యల ఆంతర్యం అదేనా!!

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ సమైక్య వాదం పేరు వినిపిస్తోంది. తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ పై సమైక్యవాదులు కుట్రలు చేస్తున్నారని, సంవత్సర కాలంగా ఆ పరిణామాలను చూస్తున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ సమాజం షాక్ అయింది.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


వైయస్ షర్మిలను టార్గెట్ చేస్తున్న క్రమంలో ఆంధ్ర అంశాన్ని తెరమీదకు తెచ్చిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇప్పుడు సమైక్యవాదుల కుట్రలు అంటూ కొత్త పాట అందుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమవుతోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి అన్నది ఇప్పుడు చర్చకు కారణమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాల వెనుక సమైక్యవాదులు కుట్రలు ఉన్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టడానికి, కెసిఆర్ ని అప్రతిష్టపాలు చేయడానికి సమైక్యవాదులు కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని జరుగుతున్న దాడులు

కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని జరుగుతున్న దాడులు

గత కొద్ది రోజులుగా టిఆర్ఎస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు, కెసిఆర్ కుటుంబం పై జరుగుతున్న కుట్రలు, తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తీరు, వైయస్ షర్మిల పాదయాత్ర, బండి సంజయ్ పాదయాత్ర, తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్ష వంటి అంశాలను ప్రస్తావించిన ఆయన ఈ పరిణామాలన్నింటినీ చూస్తే కెసిఆర్ ను దెబ్బ తీయడం కోసం జరుగుతున్న కుట్రగా కనిపిస్తోందన్నారు. ఏపీలో చేతకాక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణాను కబ్జా చెయ్యటానికి వస్తున్న సమైక్యవాదులు

తెలంగాణాను కబ్జా చెయ్యటానికి వస్తున్న సమైక్యవాదులు


తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంటే ఓర్వలేక ఇలాంటివి చేస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ కబ్జా చేయడానికి వస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతున్నాయని, అనిశ్చిత వాతావరణం ఉందని పేర్కొన్న ఆయన తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా, ఐఏఎస్ అధికారులను సైతం జైలుకు పంపించిన చరిత్ర వారిదని గుత్తా సుఖేందర్ రెడ్డి గత పాలకులను, ప్రస్తుతం వారి వారసుల రాజకీయాలను టార్గెట్ చేశారు.

గుత్తా వ్యాఖ్యల అంతర్యం ఇదే

గుత్తా వ్యాఖ్యల అంతర్యం ఇదే

ముఖ్యంగా వైఎస్ షర్మిలను, బీజేపీ రాజకీయాలను టార్గెట్ చేస్తున్న ఆయన సమైక్యవాదుల కుట్రలు అని పేర్కొనటం ద్వారా వారిని సమైక్యవాదులుగా తెలంగాణా సమాజానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారన్న భావన వ్యక్తం అవుతుంది. తెలంగాణాలో లోకల్ సెంటిమెంట్ బలంగా ఉందని నమ్ముతున్న టీఆర్ఎస్ ప్రజల్లో తాజా పరిస్థితులకు వ్యతిరేకంగా తెలంగాణ సెంటిమెంటును రగిల్చి , ప్రజల సాయంతో పోరాటం చెయ్యాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే మళ్ళీ తెలంగాణా సెంటిమెంట్ ను రగిల్చే యత్నం పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+