ఫ్రీ టిఫిన్.. గ్యాస్ కష్టాల్లో అదిరిపోయే ఐడియా

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న గ్యాస్ కొరత సామాన్యుడినే కాకుండా వ్యాపారులను కూడా ఓ ఆట ఆడుకుంటోంది. ముఖ్యంగా హోటల్ నిర్వహణ గగనంగా మారింది. సిలిండర్లు దొరక్క చాలా చోట్ల హోటళ్లు బోర్డులు తిప్పేస్తుంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఒక హోటల్ యజమాని మాత్రం అదిరిపోయే 'బంపర్ ఆఫర్' ప్రకటించారు.

"ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వండి.. నెల మొత్తం ఉచితంగా టిఫిన్ తినండి" అంటూ ఆయన తన హోటల్ ముందు పెట్టిన బ్యానర్ ఇప్పుడు పట్టణంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

Unique Offer in Telangana Bring a Gas Cylinder and Enjoy Free Tiffin for a Month at Ashwaraopet Hotel

సంక్షోభంలో సరికొత్త ఆలోచన

గ్యాస్ దిగుమతులు పడిపోవడంతో ఏజెన్సీల చుట్టూ తిరిగినా సిలిండర్లు దొరకని పరిస్థితి నెలకొంది. బ్లాక్ మార్కెట్‌లో రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి సదరు హోటల్ యజమాని ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఎవరి దగ్గరైనా అదనంగా సిలిండర్ ఉంటే, దానిని హోటల్‌కు ఇస్తే.. దానికి బదులుగా వారికి ఒక నెల పాటు ఉదయం పూట ఉచితంగా టిఫిన్ అందిస్తానని ఆయన ఆఫర్ ఇచ్చారు.

ప్రజల స్పందన

సాధారణంగా ఏదైనా కొంటే ఉచితంగా ఇచ్చే ఆఫర్లు చూస్తుంటాం, కానీ ఇలా గ్యాస్ సిలిండర్ ఇస్తే నెలంతా తిండి పెడతామనడం ఇదే మొదటిసారి కావడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. "గ్యాస్ లేక హోటల్ మూసేయడం కంటే, ఇలా ఎవరి దగ్గరైనా ఉన్న సిలిండర్లను సేకరించి వ్యాపారం కొనసాగించడం మేలు కదా!" అని నెటిజన్లు సదరు యజమాని తెలివిని మెచ్చుకుంటున్నారు.

మొత్తానికి అశ్వారావుపేట హోటల్ యజమాని ఐడియా.. గ్యాస్ కష్టాల్లో ఉన్న మిగతా వ్యాపారులకు కూడా ఒక కొత్త దారి చూపిస్తోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+