ట్రంప్ తీరుతో మనస్తాపం: హైదరాబాద్‌లో టెక్కీ భార్య రేష్మి ఆత్మహత్య
తెలంగాణ రాజధాని హైదరాబాదులోని పుప్పాలగూడలో రేష్మి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వస్థలం ఉత్తర ప్రదేశ్. ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాదులోని పుప్పాలగూడలో రేష్మి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వస్థలం ఉత్తర ప్రదేశ్. ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
అమెరికాలో తన భర్తకు వీసా రెన్యువల్ కాకపోవడంతో రేష్మి కుటుంబం దాదాపు నెల రోజుల క్రితం హైదరాబాదుకు చేరుకుంది.

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో మనస్తాపం చెందిన రేష్మి ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. రేష్మి భర్త సంజీవ్ శర్మ. ఆయన బ్యాంకాఫ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications