వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తమ్ సమక్షంలో బాబుపై రేవంత్ పొగడ్తలు: కెసిఆర్‌పై దూకుడు

రేవంత్‌రెడ్డి సోమవారం నాడు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పిసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హజరయ్యారు. ఉత్తమ్‌తో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్లు రవి కూడ హజరయ్యారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని నే

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆత్మీయుల మాట..ముచ్చట : ఆత్మబలిదానాలతో తెలంగాణా : రేవంత్‌రెడ్డి | Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి సోమవారం నాడు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పిసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హజరయ్యారు. ఉత్తమ్‌తో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్లు రవి కూడ హజరయ్యారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించేందుకు ఉత్తమ్ ఈ సమావేశానికి హజరయ్యారు.

రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కీలక టిడిపి నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. రేవంత్‌తో పాటు టిడిపి కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హజరయ్యారు.

రేవంత్‌రెడ్డి తాను టిడిపిని ఎందుకు వీడాల్సి వచ్చిందో ఈ సమావేశంలో ప్రకటించారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఏ రకంగా ఉద్యమం చేసింది. తనకు అత్యంత ఇష్టమైన నేత చంద్రబాబునాయుడును వీడాల్సి ఎందుకు వచ్చిందో ఈ సమావేశంలో ప్రకటించారు.

చంద్రబాబుపై పొగడ్తలు గుప్పించిన రేవంత్

చంద్రబాబుపై పొగడ్తలు గుప్పించిన రేవంత్

బాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిని, నమ్మకమున్న వ్యక్తిని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన నేతృత్వంలో శిక్షణ పొందిన వాడిని రేవంత్ రెడ్డి చెప్పారు.దేశ రాజకీయాలను మలుపులు తీప్పే బాబు నేతృత్వంలో పనిచేసిన వ్యక్తినని రేవంత్ రెడ్డి చెప్పారు. . అమరావతి కోసం నిద్రాహరాలు మారి పోరాటం చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.ఏపీ రాష్ట్రంలో అభివృద్ది కోసం చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ, తెలంగాణలో నడిస్తే తప్పా అని రేవంత్ ప్రశ్నించారు.టిడిపి అభిమానులకు నా ఆవేదనను పంచుకోవాలని భావిస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కెసిఆర్ పనిచేయడం లేదు. నాకు అత్యంత ఇష్టమైన నాయకుడిని, పార్టీని దండం పెట్టి, పార్టీని వదిలిపెట్టిన విషయమై ఆలోచించాలని రేవంత్‌రెడ్డి టిడిపి శ్రేణులకు కోరారు.తాను ఆషామాషీగా పార్టీ ఫిరాయింపు కాదన్నారు నా నిర్ణయాన్ని నిండు మనస్సుతో ఆదరించాలని రేవంత్‌రెడ్డి టిడిపి శ్రేణులను కోరారు.

40 నెలలో కెసిఆర్ ఏం చేశారు

40 నెలలో కెసిఆర్ ఏం చేశారు

తెలంగాణలో నిరుద్యోగ యువత కోసం కెసిఆర్ ఒక్క క్షణం కూడ ఆలోచించలేదని రేవంత్ ఆరోపణలు గుప్పించారు.ఎన్నికల్లో ఇచ్చిన హమీలను కెసిఆర్ అమలు చేయలేదని రేవంత్ ఆరోపణలు చేశారు. 14 ఏళ్ళ ఉద్యమంలో ఏనాడూ చెప్పని విషయాలను 40 నెలల కాలంలో అమలు చేస్తున్నారని కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కనీసం ఈ హమీలను అమలు చేయకుండా వ్యాపారాలు, టీవీ ఛానెల్, పేపర్ పెట్టారని రేవంత్ సీఎం పై విమర్శలు గుప్పించారు. తన కొడుకు కోసం కొత్త సెక్రటేరియట్ కట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తన కుటుంబ సభ్యుల విలాస జీవితం కోసం లక్షల కోట్లను ప్రభుత్వ ధనం వినియోగిస్తున్నారని రేవంత్ ఆరోపణలు చేశారు.. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామాకాలు లేవని రేవంత్‌రెడ్డి చెప్పారు.

కెసిఆర్‌తోనే బిజెపి

కెసిఆర్‌తోనే బిజెపి

తెలంగాణలో టిఆర్ఎస్‌తోనే బిజెపి నేతలు అంటకాగుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు టిఆర్ఎస్ బిజెపి అనుకూలంగా వ్యవహరించిన విషయాన్ని రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. బిజెపికి చెందిన కొందరు కీలక నేతలు ఈ విషయాన్ని తనతో ప్రస్తావించారని చెప్పారు. తెలంగాణ టిడిపిలో లేదని బిజెపి నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆయన చెప్పారు. టిడిపితో పొత్తు వద్దని కెసిఆర్‌తో స్నేహహస్తాన్ని బిజెపి నేతలు కోరుకొన్నారని రేవంత్ ఆరోపణలు చేశారు.

టిడిపిలో చేరడానికి ఇదే కారణం

టిడిపిలో చేరడానికి ఇదే కారణం

2007లో టిడిపిలో చేరే సమయంలో ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుబంతో తనకు సన్నిహిత సంబంధాలున్న విషయాన్ని కూడ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాదు ప్రతిపక్షంలో ఉంటనే ప్రజలకు మేలు కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారణాలతోనే తాను 2007 ఎన్నికల సమయంలోనే టిడిపిలో చేరినట్టు చెప్పారు. చంద్రబాబునాయుడు తనకు అత్యంత ఇష్టమైన నేతగా రేవంత్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణలో అవినీతి పాలన

తెలంగాణలో అవినీతి పాలన

టిఆర్ఎస్‌ పాలనకు గోరికట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నడుంబిగించిందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ ‌రెడ్డి అన్నారు. కెసిఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు తమతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉత్తమ్‌ టిడిపి నేతలను ఆహ్వనించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పాస్ చేయించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పనిచేసిందో ఉత్తమ్ వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడ న్యాయం జరగలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.ఏ రాష్ట్రంలో లేని అవినీతి తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకొంది. తెలంగాణ సమాజ మానవహక్కులను కెసిఆర్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఉత్తమ్‌కుమార్‌‌రెడ్డి ఆరోపించారు.టిఆర్ఎస్‌ను గద్దెదింపేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ సమక్షంలో అక్టోబర్ 31వ,తేది మధ్యాహ్నం 12 గంటలకు రాహూల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వనిస్తున్నట్టు ప్రకటించారు ఉత్తమ్‌కుమార్ రెడ్డి.

English summary
TPCC President N. Uttam Kumar Reddy attended Revanth reddy meeting held at hyderabad on Monday. along with PCC official spokesperson
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X