'టిఆర్ఎస్ ఏం చేయలేదు, మావల్లే హైదరాబాద్‌లో సెటిలర్స్‌కు రక్షణ'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సెటిలర్స్‌కు రక్షణ కల్పించేది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం అన్నారు. హైదరాబాద్ పరిధిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు.
నగరానికి గోదావరి, కృష్ణా జలాలను తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. సెటిలర్స్‌కు రక్షణ కల్పించేది తమ పార్టీయే అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన తెలిపారు.
అధికార పార్టీ ఎన్నికలలో గెలువలేక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. అభివృద్ధి చేయని టిఆర్ఎస్ ప్రభుత్వం, గోదావరి జలాలను తామే హైదరాబాదుకు తెచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకులను పంపించాలి
ఎన్నికల ప్రధాన అధికారి నదీమ్ జైదీని కాంగ్రెస్ నేతలు మంగళవారం నాడు ఢిల్లీలో కలిశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని వారు ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిశీలకులను పంపించాలని కోరారు. తాము పరిశీలకులను పంపించాలని ఈసీని కోరినట్లు కాంగ్రెస్ నేతలు నిరంజన్ తెలిపారు.
కరువు మండలాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం
కేంద్ర బృందం మంగళవారం నాడు కరువు మండలాల్లో పర్యటిస్తోంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తోంది. రైతులను వివరాలు అడిగి తెలుసుకుంటోంది. కగ్టి మండలం శారద తండాలో పర్యటించిన బృందం ఎండిన కందిపంటను పరిశీలించింది. కేంద్రం నుంచి సత్వరం సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని బృంద సభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications