Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వీ హనుమంతరావు సంచలన ఆరోపణలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో విభేదాలు స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న వీ హనుమంతరావు.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు విషయంలో ఉత్తమ్ వ్యవహార తీరుపై ధ్వజమెత్తారు వీహెచ్. అంబర్‌పేట సీటు తాను సిఫారసు చేసిన వ్యక్తిని కాదని.. ఓబీసీ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్‌ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్ గౌడ్ తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసు పెట్టారని అన్నారు. అంబర్‌పేట సీటు తాను లక్ష్మణ్ యాదవ్‌కు అడుగుతున్నానని.. గతంలో అక్కడ యాదవ్‌లు గెలిచిన చరిత్ర ఉందని హనుమంతరావు తెలిపారు.

V Hanumantha rao hits out at uttam kumar reddy for amberpet seat issue

గత ఎన్నికల్లో పొత్తుల్లో తనకు టికెట్ రాకుండా పోయిందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాకుండా గత ఎన్నికల్లో తాను డబ్బులు తీసుకుని వెనక్కి తగ్గానని తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతరావు డబ్బులు తీసుకునే వ్యక్తా.. ? అని ప్రశ్నించారు.

డబ్బులకు అమ్ముడుపోతే సగం హైదరాబాద్ తనదే ఉండేదని వీహెచ్ వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో బీసీ మీటింగ్ పెడతానంటే.. అక్కడ పెట్టనీయలేదని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీసీ ఓట్లు కావాలి కానీ.. బీసీ మీటింగ్ వద్దా? అని నిలదీశారు. కాంగ్రెస్ నుంచి తనను బయటకు పంపేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని వీహెచ్ ఆరోపించారు.

తాను పార్టీ మారేది లేదని.. గాంధీ కుటుంబానికి వీరాభిమానినని వీహెచ్ స్పష్టం చేశారు. ఉత్తమ్ అనుచరులైన.. మహేశ్వర్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డిలను బయటకు పంపించారని ఆరోపించారు వీహెచ్. జగ్గారెడ్డిని కూడా పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేశాడని విమర్శించారు. అంతేగకా, జగ్గారెడ్డితో పీసీసీ అధ్యక్షుడు అవుతానని చెప్పి రేవంత్‌పై ప్రతి రోజు మీడియాలో మాట్లాడించింది ఉత్తమ్‌కుమార్‌ రెడ్డినేనని ఆరోపించారు.

పార్టీ మారుతున్నానని మీడియాలో ప్రచారం చేసుకున్న ఉత్తమ్.. పార్టీ పదవులు తెచ్చుకున్నాడని విమర్శించారు. స్క్రీనింగ్ కమిటీలో ఉండి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ఉత్తమ్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన పనులను బయట పెడుతానని హెచ్చరించారని తెలిపారు. ఆయనకు, ఆయన భార్యకు సీట్లు కావాలి.. మాకు సీటు వద్దా అని వీహెచ్ నిలదీశారు. అంబర్ పేట సీటు తనదని.. తనకు దక్కకుండా చేస్తే పరిస్థితులు మారతాయని వీ హనుమంతరావు హెచ్చరించారు. తాను పార్టీ మారేది లేదని మరోసారి స్పష్టం చేశారు వీహెచ్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+