• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణలో వేరే ప్రభుత్వం ఉన్నా, హైద్రాబాద్ నుంచే గెలుపు: వెంకయ్య

|

హైదరాబాద్: తెలంగాణలో వేరే ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కలిసి పని చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ సమ్మేళనంలో ఆదివారం వ్యాఖ్యానించారు.

దేశం నచ్చిన, ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రధాని మోడీ అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అండమాన్, అసోం, హర్యానా, కాశ్మీర్.. ఇలా అంతటా బీజేపీ జెండా ఎగురుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్నారు.

2013లో ఇదే సభ నుంచి ప్రచారం (ఎల్బీ స్టేడియం) ప్రారంభించి బీజేపీ విజయ ఢంకా మోగించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ధరలు ఆకాశంలో, అవినీతి ఆకాశంలో అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో భూగర్భాన్ని, ఆకాశాన్ని.. ఇలా దేనిని వదిలి పెట్టకుండా స్కాంలకు పాల్పడిందన్నారు.

అగస్టా కుంభకోణం, బొగ్గు కుంభకోణం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అన్నారు. యూపీఏ హయాంలో అంతరిక్షం నుంచి పాతాళం వరకు అవినీతి అన్నారు. మోడీ హయాంలో అవినీతి లేదన్నారు.

Venkaiah Naidu

మోడీ అంటే త్రీడీ అన్నారు. ప్రధాని మోడీ ఇండియన్ రాక్ స్టార్ అని అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా చెప్పారన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా జనమంతా మోడీ.. మోడీ అంటున్నారన్నారు.

హైదరాబాదులో మోడీ అనవచ్చు, గుజరాత్‌లో మోడీ అనొచ్చు.. కానీ సౌదీ అరేబీయా, అమెరికా.. ఇలా అన్ని దేశాల్లో మోడీ అనడం గమనించాలన్నారు. మోడీ వల్ల ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందన్నారు. ప్రపంచ దేశాలు మోడీ నామస్మరణ చేస్తున్నాయన్నారు.

ఎన్నికల్లో ఓడిన వారు ఓటమిని జీర్ణించుకోలేక ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారన్నారు. ఈ దేశంలో ఉంటూ విదేశాలకు ఊడిగం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. హిందూ, ముస్లీం, క్రైస్తవులు, బౌద్దులు ఎవరైనా అందరూ ఒకటే అన్నారు. కులం, మతం, ప్రాంతం వేరైనా మనమంతా భారతీయులమన్నారు. ఆంధ్రా అయినా, తెలంగాణ అయినా అంతా ఒక్కటే అన్నారు.

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరం సోదరసోదరీమణులం అన్నారు. ప్రపంచంలోనే 11 కోట్ల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ యే అన్నారు. ప్రతి కార్యకర్త గడపగడపకూ వెళ్లి మన పథకాలు వివరించాలన్నారు.

మహిళలు, వెనుకబడ్డవారికి పార్లమెంటులో అధిక ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీయే అన్నారు. మోడీని లక్ష్యంగా చేసుకొని.. అందరూ తీర్థయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. హైదరాబాద్, గుజరాత్ వచ్చి తీర్థయాత్రలు చేశారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ కూడా అలాగే చేశారన్నారు. అది రాజకీయ పబ్బం కోసమే అన్నారు. యాకుబ్ మెమెన్, అప్ఝల్ గురులకు మద్దతు పలకడం పైన వెంకయ్య మండిపడ్డారు.

ఈ స్టేడియంలో (ఎల్బీ స్టేడియం) మొత్తం ఇప్పుడు నిండిపోయిందని, బయట కూడా చాలామంది ఉన్నారన్నారు. ఈ స్టేడియంలో జనాలు పట్టక పోవచ్చునని, కానీ అందరి గుండెల్లో మోడీ ఉన్నారన్నారు. తెలంగాణకు రూ.17వేల కోట్లను వివిధ పథకాల ద్వారా కేంద్రం అందించిందన్నారు.

ఇక్కడ వేరే ప్రభుత్వం ఉండవచ్చునని (తెరాస ప్రభుత్వం) కానీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్లాలని ప్రధాని మోడీ చెప్పారని వెంకయ్య గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీని శక్తిమంతమైన పార్టీగా చేయాలని వెంకయ్య ఆకాంక్షించారు.

English summary
Venkaiah Naidu suggests Telangana BJP leades to strengthen party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X