వీడియో: చీపురు పట్టి రోడ్లు ఊడ్చిన మంత్రి ఎర్రబెల్లి!!

తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రతీ రోజూ ఒక శాఖకు సంబంధించిన ప్రగతిని చర్చిస్తున్నారు. ప్రజలకు తెలంగాణా సాధించిన ప్రగతిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకో కార్యక్రమంతో తెలంగాణా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, సీపీ రంగనాథ్ తదితరులు గ్రేటర్ వరంగల్ లో నగర ప్రగతి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు.

 earrbelli1

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటుగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, సి పి రంగనాథ్ తదితరులు కూడా రోడ్లు ఊడ్చారు. సఫాయి అన్నా నీకు సలాం అంటూ నినదించారు. పరిశుభ్రంగా ఉండటానికి సఫాయి కార్మికులు కారణమని వారు అన్నారు. కెఎంసి నుండి ఎంజీఎం హాస్పిటల్ వరకు నగర ప్రగతి ర్యాలీ జరగగా, ఎంజీఎం కూడలిలో సఫాయి విగ్రహావిష్కరణ చేశారు.

అనంతరం వరంగల్ మహా నగర పాలక సంస్థలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి జరిగిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, అన్ని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ఎంత కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అని ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలన వల్లే ప్రగతి సాధ్యమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టణ ప్రగతి వేడుకలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+