మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. స్పాట్‌లో 29 మంది !

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల వరుసగా బస్సు ప్రమాద ఘటనల్లో ప్రజలు మృతి చెందిన విషయం తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరో పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ బస్సు విజయవాడ-హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలుస్తుండగా.. ఘటనలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగిందంటే..?

విహారి ట్రావెల్స్‌కు చెందిన NL 01 B 3250 నంబర్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే మొత్తం వాహనం మంటల్లో కూరుకుపోయింది. దాంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. అలానే పెద్ద శబ్దంతో ప్రయాణికులను హెచ్చరించడంతో అందరూ తక్షణమే బయటకు దూకారు. కొందరు బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మంటలు చెలరేగిన కేవలం రెండు నిమిషాల్లోనే బస్సు మొత్తం మంటల్లో ధగ్దమైందని పోలీసులు తెలిపారు.

vihari-travels-bus-got-fire-accident-at-telangana-and-news-went-viral

కాగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డ వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని, రెండు ఫైర్ ఇంజిన్‌లను సంఘటన స్థలానికి పంపించారు. అయితే వారు చేరుకునేలోపే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు దాదాపు ఒక గంట సమయం పట్టిందని ఫైర్ ఆఫీసర్లు తెలిపారు. మంటల కారణంగా రహదారిపై ఘోరమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, వందలాది వాహనాలు రద్దీగా నిలిచిపోయాయి. ఆ తర్వాత పోలీసులు రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని సర్దుబాటు చేశారు.

ఇక బస్సులో ఆ సమయంలో సుమారు 29 నుండి 40 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. వారందరూ క్షేమంగా బయటపడ్డారని, ఎవరూ గాయపడలేదని ధృవీకరించారు. కొంతమందికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, వారికి ప్రాథమిక చికిత్స అందజేసినట్లు సమాచారం. అయితే ప్రయాణికులు తమ సామాన్లు, మొబైల్ ఫోన్లు, లగేజీ మొత్తం మంటల్లో దగ్ధమైపోయిందని చెబుతున్నారు. బస్సు కంపెనీ వారు వారికి ప్రత్యామ్నాయ వాహనం ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదానికి ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ లేదా ఫ్యూయెల్ లీకేజ్ కారణమై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ టీములు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ ఆరంభమైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విహారి ట్రావెల్స్ మేనేజ్‌మెంట్‌ను విచారణకు పిలిపించనున్నట్లు సమాచారం.

ఇటీవల కాలంలో ట్రావెల్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. కొన్ని వారాల క్రితమే కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది సజీవదహనం అయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనను మరచిపోకముందే మళ్లీ ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+