viral video: అమ్మాయికోసం పబ్లిక్ గా బస్టాండులో ఘోరంగా కొట్టుకున్న యువకులు.. విద్యార్థులా.. వీధిరౌడీలా!!

చక్కగా చదువుకుని, విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాల్సిన ఇద్దరు విద్యార్థులు నడిరోడ్డు మీద బస్టాండ్ లో అందరూ చూస్తూ ఉండగా ఒక అమ్మాయి కోసం గొడవ పడిన ఘటన అక్కడ ఉన్నవారిని అందరినీ షాక్ కి గురి చేసింది. ఒక అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థులు కాళ్లతో, కర్రలతో దారుణంగా కొట్టుకున్న ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది.

అమ్మాయి కోసం.. నర్సంపేటలో యువకుల కొట్లాట

అమ్మాయి కోసం.. నర్సంపేటలో యువకుల కొట్లాట

ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్న ఇద్దరు యువకులు అమ్మాయి తనదంటే తనదేనని ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. నర్సంపేట లోని ఒకేషనల్ కళాశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఒకే అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కోసం రోడ్డుకెక్కారు. బస్టాండ్ లో జనం ఉన్నారన్న విషయాన్ని కూడా మరిచిపోయి ముష్టి యుద్ధానికి తెరతీశారు. ఇక ఇద్దరు హీరోల కోసం వారి సైన్యం కూడా రంగంలోకి దిగారు. దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టుకున్నారు. అక్కడ ఉన్న జనాలపైన పడుతూ సినీఫక్కీలో ఒకరినొకరు పట్టుకొని విపరీతంగా కొట్టుకున్నారు. కర్రలు తీసుకొని మరీ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

 గతంలోనూ కత్తులు తీసుకుని దాడికి యత్నం

గతంలోనూ కత్తులు తీసుకుని దాడికి యత్నం


ఇంతకు ముందు రెండు రోజుల క్రితం కూడా వారిద్దరూ కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే ఆ సమయంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఇరువురు అక్కడి నుండి పారిపోయారు. మళ్లీ తాజాగా బస్టాండ్ లో జనం ముందు అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తూ దారుణంగా దాడికి పాల్పడ్డారు. బస్సుల కోసం వేచి ఉన్న జనాలపైన పడుతూ తన్నుకున్నారు. అమ్మాయితో నువ్వు మాట్లాడొద్దు అంటూ, ఒకవేళ మాట్లాడితే ఏదైనా చేస్తాం అంటూ ఒకరిపై ఒకరు విరుచుకు పడిన వారు, కడుపులో కాళ్లతో తన్నుకుంటూ, కర్రలతో బాదేసుకున్నారు.

 బస్టాండ్ లో ప్రయాణీకులను భయభ్రాంతులకు గురి చేస్తూ దాడి

బస్టాండ్ లో ప్రయాణీకులను భయభ్రాంతులకు గురి చేస్తూ దాడి


ఇక ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఇద్దరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు, స్థానికులు ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి వీరిద్దరు దాడులకు పాల్పడినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ దారుణం జరిగేది కాదని అంటున్నారు. బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తూ కొట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

విద్యార్థులా వీధి రౌడీలా.. స్థానికుల ఆగ్రహం


విద్యార్థులా వీళ్ళు వీడి రౌడీలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక అమ్మాయి కోసం రోడ్డుకి ఎక్కి మరీ తన్నుకుంటున్న వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు పెరిగిపోవడం, చదువు పైన శ్రద్ధ పెట్టాల్సిన యువత ప్రేమ పేరుతో పెడదారిలో పడడం సర్వసాధారణమైపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+