నాకే ఓటు వేయండి: పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి సర్వే హల్‌చల్
వరంగల్: వరంగల్ లోకసభ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో వర్థన్ననపేట పోలింగ్ కేంద్రంలోకి అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ వెళ్లడం వివాదాస్పమైంది.
అంతేగాక, తనకు ఓటు వేయాలని పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను సర్వే సత్యనారాయణ అభ్యర్థించారు. కాగా, సర్వే పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ టిఆర్ఎస్ తోపాటు ఇతర పార్టీలు మండిపడుతున్నాయి.

ఇది ఉండగా, మధ్యాహ్నం 3గంటల సమయానికి 57శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. స్టేషన్‌ఘన్‌పూర్ 69శాతం, పాలకుర్తి 65శాతం, పరకాల శాతం, వరంగల్ పశ్చిమ 39శాతం, వరంగల్ తూర్పు 55శాతం, భూపాలపల్లి 60శాతం, వర్థన్నపేట 61శాతం ఓటింగ్ నమోదైంది.












Click it and Unblock the Notifications