తెలంగాణా ప్రభుత్వానికి వీఆర్‌ఏల షాక్: రెవెన్యూ సదస్సుల బహిష్కరణ.. 25నుంచి సమ్మె సైరన్!!

తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగులు ఊహించని షాక్ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వీఆర్ఏలు తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా, తమ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటన చేసి సమ్మె సైరన్ మోగించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దాక విధులకు హాజరయ్యేది లేదంటూ వీఆర్ఏలు తేల్చిచెప్పారు.

 సమ్మె సైరన్ మోగించిన తెలంగాణా వీఆర్ఏలు

సమ్మె సైరన్ మోగించిన తెలంగాణా వీఆర్ఏలు


సమ్మె సైరన్ మోగించిన వీఆర్ఏలు ఈనెల 25వ తేదీ నుండి తాము సమ్మె చేస్తామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో నోటీసు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం, ధరణి పోర్టల్ నేపథ్యంలో తలెత్తిన భూ వివాదాలను పరిష్కరించే ఉద్దేశంతో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో తాజాగా వీఆర్ఏలు సమ్మె బాట పడతామని అల్టిమేటం జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ అనే చెప్పాలి.

 వీఆర్ఏలకు తెలంగాణా సీఎం కేసీఆర్ హామీలు .. నేరవేర్చలేదంటున్న వీఆర్ఏలు

వీఆర్ఏలకు తెలంగాణా సీఎం కేసీఆర్ హామీలు .. నేరవేర్చలేదంటున్న వీఆర్ఏలు


2020 సెప్టెంబర్ 9వ తేదీన శాసనసభలో కొత్త రెవెన్యూ చట్టం పై చర్చ జరిపిన సందర్భంగా వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని, తండ్రుల స్థానంలో అర్హులైన పిల్లలు ఉంటే వారికి ఉద్యోగాలు కల్పిస్తామని, అర్హత ఉన్న వారికి పదోన్నతి కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని రెండుసార్లు సీఎం కెసిఆర్ సభలో చెప్పినప్పటికీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరగలేదని, ఇప్పటివరకు ఎటువంటి హామీని నెరవేర్చలేదని వీఆర్ఏలు చెబుతున్నా

ప్రభుత్వం స్పందించకనే వీఆర్ఏల సమ్మె బాట

ప్రభుత్వం స్పందించకనే వీఆర్ఏల సమ్మె బాట


రాష్ట్రంలో 21 వేల మంది వీఆర్ఏలు, 2500 మంది డైరెక్ట్ గా రిక్రూట్ అయిన వీఆర్ఏలు విధుల్లో ఉన్నారని వీరిలో 90శాతం మంది వెనుకబడిన నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని, వీరంతా ప్రస్తుతం వస్తున్న జీతంతో అర్ధాకలితో జీవిస్తున్నారని వీఆర్ఏలు చెబుతున్నారు. ఈ క్రమంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం వివిధ రూపాల్లో ఇప్పటికే నిరసన తెలియజేసిన వీఆర్ఏలు, ప్రభుత్వం నుంచి, రెవెన్యూ శాఖ నుండి స్పందన లేని కారణంగా సమ్మె చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

రెవెన్యూ సదస్సులకు దూరంగా ఉంటామన్న వీఆర్ఏలు .. ప్రభుత్వానికి షాక్

రెవెన్యూ సదస్సులకు దూరంగా ఉంటామన్న వీఆర్ఏలు .. ప్రభుత్వానికి షాక్


అంతే కాదు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రభుత్వం నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు వీఆర్ఏలు దూరంగా ఉంటారని వీఆర్ఏల జేఏసీ ప్రకటించింది. దీంతో ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్టు అయ్యింది. ఇక నిరవధిక సమ్మె సైరన్ మోగించనున్న నేపథ్యంలో రోజువారీ కార్యాచరణను చేపట్టాలని నిర్ణయించిన జేఏసీ 11వ తేదీ నుంచి రోజుకో జిల్లాలో సమావేశాలు నిర్వహించాలని, 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలను నిర్వహించాలని , 23వ తేదీన కలెక్టరేట్ల ముట్టడి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక 25వ తేదీ నుంచి మండల కేంద్రాల్లో నిరవధిక సమ్మె కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+