సికింద్రాబాద్ స్టేషన్ నుండి ఎస్సార్ నగర్ వరకూ నడక.!చక్రిని వెతుక్కుంటూ కందికొండ నగరానికి రాక.!
హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి అకాల మరణం సినీ సాహిత్య ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. గొంతు క్యాన్సర్ తో గత మూడేళ్లుగా బాధ పడుతున్న కందికొండకు వైద్యులు కీమో థెరపీ చేయడంతో దాని ప్రభావం వెన్నుపూస మీద పడింది. దీంతో ఎడమ కాలు, ఎడమ చెయ్యి కదలికలో తేడా వచ్చింది. అదే సమయంలో కందికొండ నగరంలోని కిమ్స్ లో చేరారు. మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస యాదవ్ చొరవ తీసుకుని కందికొండ ఆసుపత్రి ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దాంతో దాదాపు నెల రోజులు కిమ్స్ లో వైద్యం తీసుకున్న కందికొండ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఓ స్నేహం జీవితాన్ని మార్చింది.. చక్రితో స్నేహం కందికొండకు కొత్త జీవితాన్నిచ్చింది..
కందికొండ అసలు పేరు యాదగిరి. వరంగల్ జిల్లా అయినప్పటికి మహబూబాబాద్ లో చక్రి, కందికొండ స్నేహితులు. పెళ్లిళ్లకు, ఇతర వేడుకలకు చిన్నా చితకా ఆర్కెష్ట్రా కార్యక్రమం నిర్వహించి పాటలు పాడటం చక్రి హాబీగా ఉండేది. అందులో కందికొండ మాగ్గాడి శుభ పాటలను పాడి ఆడియన్స్ ను ఉర్రూతలూగించే వారు. ఆ తర్వాత ఉద్యోగం కోసం చక్రి హైదరాబాద్ రావడం, మార్కెటింగ్ ఉద్యోగం చేస్తూనే సినిమా సంగీత దర్శకుడిగా ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు చక్రి. 1995లో నగరానికి వచ్చిన చక్రికి 1998లో సినిమా అవకాశం వచ్చింది. చక్రితో పాటు తాను కూడా సినీ ప్రయత్నాలు చేసేందుకు నగరానికి వచ్చేందుకు ఉత్సాహం చూపేవాడు కందికొండ.

వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి.. కందికొండను అక్కున చేర్చుకున్న చక్రి
కందికొండ కుటుంబం ఆర్థికంగా స్ధిరపడిన కుటుంబం కాదు. అనేక ఆర్ధిక సమస్యలు వెంటాడుతుండేవి. సినిమా పరిశ్రమలో పాటల రచయితగా స్థిరపడాలని, అందుకు చక్రి సాయం కోరాలని కందికొండ ఆలోచింస్తుండేవాడు. అలాంటి సమయంలో 1999లో మహబూబాబాద్ లో ఉదయం రైలెక్కి 11గంటల వరకూ హైదరాబాద్ చేరుకున్నారు కందికొండ. ఆటోకు గాని, బస్సుకు గానీ డబ్బులు లేక పోవడంతో సికిందరాబాద్ స్టేషన్ నుండి కాలి నడకన ఎస్సార్ నగర్ లోని చక్రి ఆఫీస్ వరకూ వచ్చారు. చక్రి లేడని సాయంత్రం 5గంటలకు వస్తారని ఆఫీస్ వాళ్లు చెప్పడంతో సుమారు ఐదు గంటలు తిండి, నీళ్లు లేకుండా ఎస్సార్ నగర్ పార్క్ లో గడ్డి మీద పడుకున్నాడు కందికొండ.

కందికొండను ఎక్కువగా ప్రోత్సహించిన చక్రి.. తప్పులను సరిదిద్ది బుజం తట్టిన స్నేహితుడు
సాయంత్రం 5.15కు కందికొండను చూసిన చక్రి ముందుగా స్థానికి హోటల్ లో భోజనం పెట్టించారు. తర్వాత ఎస్సార్ నగర్ పాత పోలీస్ స్టేషన్ వెనక ఉన్న రూంకు తీసుకెళ్లి మంచి చెడ్డ మాట్లాడుకున్నారు. అలా నగరానికి చేరకున్న కందికొండకు చక్రి స్నేహం కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఇద్దరూ కలిసి సినిమా ప్రయత్నాలు చేయడం, కుటుంబ సమస్యలతో కందికొండ సినిమా ప్రయత్నాలకు బ్రేకులు వేస్తూ తిరిగి సొంత గ్రామానికి వెళ్లిపోవడం, మళ్లీ చక్రి పిలిపించడం వంటి సందర్బాలు అనేక ఉన్నాయి. ఎన్నో ఒడిదొడుకులు తర్వాత నెమ్మదిగా అరకొర పాటలు రాసే అవకాశాలు వచ్చాయి కందికొండకు. కందికొండ రాసిన పాటలను మొదట చక్రి చెక్ చేసి చాలా మార్పులు చేసేవాడు.

మలుపు తిప్పిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా.. కందికొండ కలం నుండి జాలువారిన మళ్లి కూయవే గువ్వా పాట
సినిమా పాటల్లోని పల్లవి ఎలా ఉండాలి, చరణాలు ఏ విధంగా ఉండాలో కందికొండకు నేర్పించింది కూడా చక్రీనే. కందికొండ యాదగిరి కాకుండా ఒక్క కందికొండగా సినీ సాహిత్య ప్రపంచానికి పరిచయం చేసింది కూడా చక్రీనే. 2000వేల సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాచి సినిమా తర్వాత చక్రి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆతర్వాత 2001లో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం తర్వాత కందికొండ కూడా వెనక్కి చూసుకోలేదు. ఆ సినిమాలో మళ్లి కూయవే గువ్వా అనే పాట బ్లాక్ బస్టర్ కావడంతో సినీ సాహిత్య ప్రపంచంలో కందికొండ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. దాంతో దాదాపు మూడు వేల పాటల వరకూ రాసారు కందికొండ. కందికొండ అకాల మరణంతో సినీ సాహిత్యలోకం చిన్నబోయినట్టయ్యింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications