బండి సంజయ్‌కు పోలీస్ మార్క్ షాక్.. వరంగల్లో ఆగస్ట్31వరకు బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం!!
మూడో
విడత
బండి
సంజయ్
ప్రజా
సంగ్రామ
యాత్ర
తెలంగాణ
రాష్ట్రంలో
రసవత్తర
రాజకీయాలకు
కారణంగా
మారింది.
బండి
సంజయ్
పాదయాత్రను,
బండి
సంజయ్
హన్మకొండలోని
ఆర్ట్స్
అండ్
సైన్స్
కళాశాల
గ్రౌండ్స్
లో
నిర్వహించ
తలపెట్టిన
బహిరంగ
సభను
అడ్డుకోవడం
కోసం
పోలీసులు
శతవిధాలా
ప్రయత్నం
చేస్తున్నారు.
ఇప్పటికే
బహిరంగ
సభకు
సంబంధించి
పోలీసులు
అనుమతులు
ఇవ్వకుండా
నిర్ణయం
తీసుకున్నారు.
దీంతో
కళాశాల
యాజమాన్యం
బహిరంగ
సభకు
అనుమతి
ఇవ్వలేమని
బిజెపి
నేతలకు
స్పష్టం
చేసింది.
నువ్వా
నేనా?
వరంగల్
లో
బహిరంగసభపై
బీజేపీ
వర్సెస్
టీఆర్ఎస్;
కొనసాగుతున్న
టెన్షన్!!

వరంగల్ కమీషనరేట్ పరిధిలో బహిరంగసభలు, సమావేశాలు, ర్యాలీ లపై నిషేధిత ఉత్తర్వులు
ఇక
తాజాగా
వరంగల్
పోలీస్
కమిషనరేట్
మరో
సంచలన
నిర్ణయం
తీసుకుంది.
వరంగల్
పోలీస్
కమిషనరేట్
పరిధిలో
బహిరంగసభలు,
సమావేశాలు,
ర్యాలీలపై
నిషేధిత
ఉత్తర్వులను
జారీ
చేశారు
వరంగల్
పోలీస్
కమిషనర్
డాక్టర్
తరుణ్
జోషి.
ప్రజా
భద్రత
దృష్ట్యా,
శాంతి
భద్రతల
పరిరక్షణ
కోసం,
ప్రశాంతతను
కాపాడాలనే
ఉద్దేశంతో
వరంగల్
పోలీస్
కమిషనరేట్
పరిధిలో
30
సిటి
పోలీస్
యాక్ట్
అమల్లో
ఉంటుందని
ఆయన
వెల్లడించారు.

ఆగస్ట్ 31 వరకు 30 సిటి పోలీస్ యాక్ట్ నిబంధనలు అమల్లో
ఈ
నెల
31వ
తేదీ
వరకు
ఈ
నిబంధనలు
అమలులో
ఉంటాయని,
ఎవరు
ఎలాంటి
బహిరంగసభలు,
సమావేశాలు,
ర్యాలీలు
నిర్వహించడానికి
వీలులేదని
ఆయన
పేర్కొన్నారు.
వరంగల్
జిల్లాలో
బహిరంగ
సభలు,
ర్యాలీలు
నిర్వహిస్తే
శాంతిభద్రతలకు
విఘాతం
కలుగుతుందని
తమకున్న
సమాచారం
నేపథ్యంలో
ఈ
నిషేధాన్ని
విధిస్తూ
వరంగల్
పోలీస్
కమిషనర్
డా.
తరుణ్
జోషి
శుక్రవారం
ఉత్తర్వులను
జారీ
చేసారు.
ఈ
ఉత్తర్వులను
అనుసరించి
26వ
తేదీ
ఉదయం
6
గంటల
నుండి
ఆగస్టు
31వ
తేదీ
ఉదయం
6
గంటల
వరకు
ఎవరు
ఎలాంటి
ర్యాలీలు
చేయకూడదని,
సభలను
నిర్వహించకూడదని
పేర్కొన్నారు.

ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు
ఆరు
రోజులపాటు
ఈ
నిషేధిత
ఉత్తర్వులు
అమల్లో
ఉంటాయని
వెల్లడించారు.
ఇక
వరంగల్
పోలీస్
కమిషనరేట్
ఇచ్చిన
ఉత్తర్వులను
ఉల్లంఘించి
ఎవరైనా
ర్యాలీలు
చేసినా,
బహిరంగ
సభలు
నిర్వహించినా,
వారిపై
చట్టపరమైన
చర్యలు
తీసుకోవటం
జరుగుతుందని
వరంగల్
కమిషనర్
తరుణ్
జోషి
హెచ్చరిస్తున్నారు.
ఈ
నేపధ్యంలో
బీజేపీ
నేతలకు
పోలీసులు
తమ
మార్క్
షాక్
ఇచ్చినట్టు
అయ్యింది.

బండి సంజయ్ పాదయాత్ర, బహిరంగసభతో వరంగల్ లో టెన్షన్ ..
మరోవైపు
బండి
సంజయ్
పాదయాత్రను
అడ్డుకోవడం
కోసం
తెలంగాణ
ప్రభుత్వం
మరోమారు
కోర్టు
మెట్లు
ఎక్కిన
విషయం
తెలిసిందే.
బండి
సంజయ్
పాదయాత్రను
సవాల్
గా
తీసుకున్న
టీఆర్ఎస్
పాదయాత్రను
అడ్డుకోవాలని,
బహిరంగ
సభను
నిర్వహించకుండా
అడ్డుకోవాలని
ప్రయత్నం
చేస్తుంటే,
టిఆర్ఎస్
ప్రభుత్వం
కల్పిస్తున్న
అవరోధాలను
అధిగమించి,
కోర్టు
ఆదేశాలతో
బండి
సంజయ్
పాదయాత్రను
కొనసాగించడంతోపాటుగా,
బహిరంగ
సభను
సైతం
నిర్వహించాలని
భావిస్తున్నారు.
మరి
పోలీసుల
తాజా
నిర్ణయంతో
బిజెపి
నేతలు
ఏం
చేస్తారన్నది
తెలియాల్సి
ఉంది.
బండి
సంజయ్
పాదయాత్ర,
బహిరంగసభతో
వరంగల్
లో
టెన్షన్
వాతావరణం
చోటు
చేసుకుంది.