Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరంగల్ లో మూడు హత్యల కేసులో గగుర్పొడిచే నిజాలు ; కళ్ళలో కారం కొట్టి, ఎలక్ట్రిక్ రంపాలు, వేట కత్తులతో ఊచకోత

వరంగల్ నగరం నిన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్యలతో ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. వరంగల్ నగర ఎల్బీనగర్లో ఒకే కుటుంబానికి చెందిన చాంద్ పాషా అతని భార్య సాబీరా, చాంద్ పాషా బావమరిది ఖలీల్ ను అత్యంత దారుణంగా కత్తులతో నరికి, అడ్డొచ్చిన పిల్లలపై కూడా కత్తులతో, ఎలక్ట్రిక్ రంపంతో ఊచకోత కోసి దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒక్క 15 నిమిషాల వ్యవధిలో సినీ ఫక్కీలో అత్యంత క్రూరంగా సోదరుడిపై, సోదరుడి కుటుంబంపై దాడి చేశాడు మహమ్మద్ షఫీ. రక్త సంబంధాన్ని కూడా మరిచిపోయి కత్తులతో వీరంగం వేసి, రక్తపు ముద్దలుగా, విగతజీవులుగా అన్న కుటుంబాన్ని మార్చిన షఫీతో పాటు,ఈ ఘటనలో కీలకంగా ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

వరంగల్ మూడు హత్యల కేసులో నిందితుల అరెస్ట్

వరంగల్ మూడు హత్యల కేసులో నిందితుల అరెస్ట్

నిన్న వరంగల్ ఎల్బీనగర్ ప్రాంతంలో సొంత అన్న చాంద్ పాషాతో పాటు వదిన సబీరాబేగం, అన్న బావమరిది ఖలీల్ పాషాని పాశవికంగా హత్య చేయడంతో పాటు, అన్న కుమారులను సైతం హత్య చేసేందుకు ప్రయత్నించిన మృతుడి తమ్ముడు మహమ్మద్ షఫీతో పాటు అతనికి సహకరించిన మరో ఐదుగురు నిందితులను ఇంతేజార్ గంజ్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుండి హత్యలు చేసేందుకు వినియోగించిన వేట కత్తులతో పాటు, చెట్లను నరికే బ్యాటరీ కోత మిషన్ మరియు రెండు ఆటోలు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఎల్బీనగర్ హత్యల కేసులో నిందితులు వీరే

ఎల్బీనగర్ హత్యల కేసులో నిందితులు వీరే

పోలీసులు అరెస్టు చేసిన నిందితులలో మృతుడి సోదరుడైన ప్రధాన నిందితుడు మహమ్మద్ షఫీతో పాటు నర్సంపేట కు చెందిన బోయిని వెంకన్న, వరంగల్ కు చెందిన యం.డి సాజీద్, భూపాలపల్లికి చెందిన రాగుల విజేందర్ ,వరంగల్ కు చెందిన యం.డి మిరా అక్బర్, యం.డి పాషాలు ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి హత్యలకు గురైయిన మృతుల్లో ఒకడు మహమ్మద్ చాంద్ పాషా మరియు హత్య చేసిన ప్రధాన నిందితుడు మహమ్మద్ షఫీ స్వయాన అన్నదమ్ములని , వీరికి నలుగురు అక్కా చెల్లెళ్ళు వున్నారని పేర్కొన్నారు. వీరు పది సంవత్సరాల క్రితం పరకాల ప్రాంతం నుండి తరలివచ్చి వరంగల్ నగరంలో స్లిరపడ్డారని తెలిపారు.

లాభాలు అన్న తీసుకుని నష్టాలు తమ్ముడికి పంచాడని కక్ష

లాభాలు అన్న తీసుకుని నష్టాలు తమ్ముడికి పంచాడని కక్ష

మృతుడు చాందపాషాతో పాటు ప్రధాన నిందితుడు షఫీ ఇరువురు గత ముప్పై సంవత్సరాలుగా పర్కాల, జంగాలపల్లి, ఏటూరునాగారం ప్రాంతాల్లో పశువులను కొనుగోలు చేసిన వాటిని హైదరాబాద్ లోని కబేళాలకు తరలించే వ్యాపారాన్ని నిర్వహించేవారని, ఈ వ్యాపారం ద్వారా వచ్చే లాభాన్ని అన్నదమ్ములు ఇరువురు సమానంగా వాటాలను పంచుకోనేవారని సీపీ పేర్కొన్నారు . సీపీ చెప్పిన కథనం ప్రకారం గత రెండు సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో వీరికి నష్టాలు రావడంతో, గతంలో జరిగిన వ్యాపారంలో తన అన్న ఎక్కువ మొత్తంలో లాభాలను తీసుకుని పెద్ద ఇల్లు కట్టాడని నిందితుడు ఆరోపిస్తూ, వ్యాపారంలో నష్టాలు రావడంతో చెల్లించాల్సిన అప్పులను చెల్లించి తనకు రావాల్సిన వాటా డబ్బును తిరిగి ఇవాల్సిందిగా నిందితుడు పెద్ద మనుషుల మధ్య పంచాయితీని నిర్వహించాడు.

ఎన్ని పంచాయితీలు పెట్టినా అప్పులు కట్టటానికి అంగీకరించని అన్న

ఎన్ని పంచాయితీలు పెట్టినా అప్పులు కట్టటానికి అంగీకరించని అన్న

ఇందుకు మృతుడు చాంద్ పాషా అంగీకరించకపోవడంతో చేసిన అప్పులు చెల్లించాల్సిన బాధ్యత ప్రధాన నిందితుడు షఫీ మీద పడింది. అప్పులతో తనకు సంబంధం లేదని చెప్పిన చాంద్ పాషా, అప్పుల విషయంలో తమ్ముడు మీద ఒత్తిడి చేశాడు. ఆరునెలల క్రితం పశువులను కొనుగోలు చేసిన రైతులకు, ఇతర వ్యాపారస్థులకు డబ్బులు చెల్లించాల్సి వున్నందున సదరు రైతులు, వ్యాపారులు తమ పశువులను నిలిపివేయడంతో చెల్లించాల్సిన డబ్బులకు నాకు ఎలాంటి సంబంధం లేదని వాటిని తన తమ్ముడు చెల్లిస్తాడని రైతులను మృతుడు నిందితుడి వద్దకు పంపడంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదయింది. నిందితుడు షఫీ తన అన్న చాంద్ పాషాపై కక్ష పెంచుకుని తన అన్నతో పాటు అన్న కుటుంబ సభ్యులను చంపేందుకు తమ్ముడు షఫీ నిర్ణయించుకున్నాడు.

అన్న కుటుంబ హత్యకు స్కెచ్ వేసిన తమ్ముడు .. ఎలెక్ట్రిక్ రంపాలతో పాటి వేట కొడవళ్ళు

అన్న కుటుంబ హత్యకు స్కెచ్ వేసిన తమ్ముడు .. ఎలెక్ట్రిక్ రంపాలతో పాటి వేట కొడవళ్ళు

ఇందులో భాగంగా నిందితుడు తమ వద్ద పనిచేసే వారితో పాటు తన మిత్రులైన మిగితా నిందితులు పాషా, సాజిద్, విజేందర్, మీర్జా అక్బర్, వెంకన్నలతో హత్యకు ప్లాన్ చేశాడు. హత్యలు చేసేందుకుగాను హైదరాబాద్ లో ఐదు వేటకత్తులతో పాటు వరంగల్ నగరంలో బ్యాటరీతో పనిచేసే చెట్లను నరికే మిషన్ ను కోనుగోలు చేసి నిందితులు ఆర్థరాత్రి రెండు గంట సమయంలో అన్న కుటుంబాన్ని హతమార్చడానికి మిగతా నిందితులు తో కలిసి వెళ్ళాడు. చెట్లను నరికే మిషన్ తో ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తొలగించారు. ఇంట్లోకి కరెంట్ కట్ చేశారు.

Recommended Video

    పాఠశాలల ప్రారంభంపై సబిత ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకురాళ్లు
    కళ్ళలో కారం కొట్టి సినీ ఫక్కీలో ఊచకోత .. మృతుల హాహాకారాలతో పారిపోయిన నిందితులు

    కళ్ళలో కారం కొట్టి సినీ ఫక్కీలో ఊచకోత .. మృతుల హాహాకారాలతో పారిపోయిన నిందితులు

    ఏం జరుగుతుందో అర్థం కాక గట్టిగా చాంద్ పాషా, కుటుంబ సభ్యులు కేకలు పెడుతుండగా నిందితులు వారి కళ్లలో కారం కొట్టి రంపం మిషన్లు, వేట కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో చాంద్ పాషా తో పాటు, అతని భార్య సబీరాబేగం, బావమరిది ఖలీల్ షా సంఘటన స్థలంలోనే మృతిచెందగా చాంద్ పాషా ఇరువురు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు . చాంద్ పాషా కుమార్తె గదిలో నుండి బయటకి వచ్చి గట్టిగా అరుస్తూ వారిని చంపడం నిందితులను వేడుకుంది. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేస్తున్న సమయంలో నిందితులు హాహాకారాలు చేశారు. దీంతో చుట్టు పక్కల వాళ్ళు ఏం జరిగిందని బయటకు వస్తున్నారని గమనించి నిందితుడు అక్కడి నుండి పారిపోయారని వెల్లడించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+